MS Dhoni : స్టార్ హీరోతో సినిమా నిర్మించ‌బోతున్న ఎంఎస్ ధోని..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

MS Dhoni : స్టార్ హీరోతో సినిమా నిర్మించ‌బోతున్న ఎంఎస్ ధోని..!

MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా క్రికెట్ చరిత్ర.. ధోనీకి ముందు ధోనీ తర్వాత అని చెప్పాలి. అతని సారథ్యంలోనే భారత్ రెండు ప్రపంచ కప్‌లతో పాటు ఓ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది . 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. దాదాపు ఏడాదికాలంగా క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. భారత్ జట్టులోకి 2004లో అరంగేట్రం చేసిన ధోనీ.. 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లాడాడు. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :22 June 2022,7:30 pm

MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా క్రికెట్ చరిత్ర.. ధోనీకి ముందు ధోనీ తర్వాత అని చెప్పాలి. అతని సారథ్యంలోనే భారత్ రెండు ప్రపంచ కప్‌లతో పాటు ఓ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది . 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. దాదాపు ఏడాదికాలంగా క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. భారత్ జట్టులోకి 2004లో అరంగేట్రం చేసిన ధోనీ.. 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లాడాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే భారత్‌లోనూ ఓ పవర్ హిట్టర్‌ ఉన్నాడని క్రికెట్ ప్రపంచానికి తెలియజెప్పిన ధోనీ..

కెప్టెన్‌గానూ 2007‌లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా.. ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. టీమిండియా మాజీ సారథి స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఇక సినీ రంగ ప్రవేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయనకు ఉన్న ఇమేజ్ కు పక్కాగా హీరోగానే ఎంట్రీ ఇస్తాడు అనుకున్నారు ఫ్యాన్స్ కాని.. అభిమానులను నిరాశపరుస్తూ..ధోనీ.. నిర్మాతగా మాత్రమే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అది కూడా తమిళ ఫిలమ్మ్ ఇండస్ట్రీ నుంచి సినిమా నిర్మించబోతున్నట్టు సమాచారం. .

vijay movie with MS Dhoni

vijay movie with MS Dhoni

MS Dhoni : ధోని నిర్మాణంలో విజ‌య్..

ధోనీ నిర్మాణ సంస్థలో రాబోయే ఆ తొలి సినిమాకు హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేసినట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుందని సమాచారం ఇదిలా ఉండ‌గా, విజయ్ హీరోగా ఓ సినిమా నిర్మించాలని మహేంద్ర సింగ్ ధోనీ ఫిక్సయిపోయాడని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, అతి త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అధికారికంగా ప్రకటితం కానుందట. ద‌ర్శ‌కుడు ఎవ‌రు, సాంకేతిక నిపుణులు ఎవ‌ర‌నే దానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. భారీ బడ్జెట్‌తో ధోనీ నిర్మాణంలో విజయ్ హీరోగా సినిమా తెరకెక్కుతుందని తమిళ సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది