Puri Jagannadh : పూరీ జగన్నాథ్ ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టిన ఛార్మి.. స్పందించిన ఆకాశ్ పూరీ
Puri Jagannadh : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరు అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు టాప్ హీరోలతో అద్భుతమైన సినిమాలు చేసిన పూరీ ఇప్పుడు కుర్ర హీరోలతో ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రస్తుతానికి పూరీ జగన్నాథ్ కెరియర్ మంచి పీక్స్‌లో ఉందనే చెప్పాలి. త్వరలో లైగర్ సినిమాతో పలకరించబోతున్నాడు పూరీ. అయితే ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి చార్మీల మధ్య ఎంటో ఉందని ఎప్పటి నుంచి పుకార్లు వస్తున్నాయి. మరోవైపు వీరిద్దరు స్టార్ట్ చేసిన సంస్థలో పలు సినిమాలు కూడా తీస్తున్నారు. అయితే పూరీ తన భార్యకు విడాకులు ఇస్తారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది.
ఈ అంశంపై తాజాగా పూరీ కుమారుడు ఆకాశ్ స్పందించాడు. తన నాన్న పూరీ ఒక సందర్భంలో కార్లు, ఇంటిని కూడా అమ్ముకున్న పరిస్థితి ఎదురైనట్లు చెప్పాడు. ఆ క్రమంలో అమ్మ అండగా ఉంటు సపోర్ట్ చేసిందని తెలిపాడు. ఆ తర్వాత క్రమంగా సాధారణ పరిస్థితికి వచ్చినట్లు వెల్లడించాడు. తమ పేరెంట్స్ ప్రేమ పెళ్లి చేసుకున్నారని, కానీ విడిపోతారు, విడాకులు అనే వార్తలు నిజం కాదని కొట్టిపారేశాడు. ‘అమ్మానాన్నల మధ్య గొడవలు, విడాకుల విషయాలు తనకైతే తెలియదని చెప్పిన ఆకాష్ పూరి..

puri jagannadh son clarity about family issues
Puri Jagannadh : అసలు నిజం ఇది..
వాళ్ల మధ్యన అసలు ఎలాంటి మనస్పర్ధలు లేవని’ స్పష్టం చేశారు. విడాకులు అని ప్రచారం చేస్తున్న వారికి అదో టైం పాస్ అంటూ పూరి తనయుడు అసలు నిజాన్ని క్లారిటీ ఇచ్చాడు. అమ్మ ఎప్పుడూ వీక్ పర్సన్ కాదని.. డాడీకి ఫ్యామిలీ టెన్షన్ లేకుండా చేస్తుందని.. తనను, తన చెల్లిని బాగా చూసుకొని పెంచిందని ఆకాష్ పూరి తెలిపారు. ఒకానొక సమయంలో నాన్న కారు, ఇల్లు అన్నీ కోల్పోయి ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నా మాకు ఏవీ తెలియకుండా అమ్మ జాగ్రత్త పడిందని ఆకాష్ తెలిపారు.