GopiChand : గోపీచంద్ ముక్కుని బ్లేడ్‌తో కట్ చేసిన సోదరుడు.. రక్తంతో తడిచిన అన్నం
GopiChand : టాలీవుడ్ యాక్షన్ హీరోలలో ఒకరు గోపిచంద్. కంప్లీట్ మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకొని కెరీర్లో దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తూన్నాడు. మంచి నటనతో పాటు.. ఆరడుగుల యాక్షన్ కటౌట్ తో మాచో స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. మరి కొద్ది రోజులలో పక్కా కమర్షియల్ చిత్రంతో పలకరించనున్నాడు గోపిచంద్. ఇటీవలే విడుదలైన సీటీమార్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా గోపిచంద్‌కు మాత్రం కమర్షియల్ హిట్‌గా నిలవలేకపోయింది. ప్రస్తుతం ఈయన ఆశలన్ని పక్కా కమర్షియల్ పైనే.ఈ మూవీకి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన గోపిచంద్.. గోపీచంద్ తన చిన్నప్పటి విషయాలను పంచుకుంటూ.. నా అన్న ప్రేమ్‌చంద్ బ్లేడు తీసుకుని నా దగ్గరకు వచ్చి.. నా ముక్కు కోసేశాడని.. అప్పుడు నేను పెరుగన్నం తింటున్నాను. నా ముక్కు నుంచి రక్తంకారుతూ నా పళ్లెంలో నిండిపోయిందని తెలిపారు. తన ఎనిమిదేళ్ల వయసులో నాన్న చనిపోయారని.. చిన్నప్పుడే జీవితం చాలా నేర్పించిందని తెలిపుతూ ఏమోషనలయ్యాడు. ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పాటను వదిలింది టీమ్. అందాల రాశి అంటూ సాగే ఈ పాట బాగుంది. నెటిజన్స్ తెగ ఆకట్టుకుంటోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా..
కృష్ణ కాంత్ రాశారు. శ్రీ చరణ్, రమ్య బెహరా పాడారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. హీరోగా చేసిన తర్వాత విలన్ గా అంటే ఎవ్వరికీ పెద్దగా ఇష్టం ఉండదు.కానీ గోపి తనలోని నటుడిని నిరూపించుకోవాలనే తపనతో ‘‘జయం’’ మూవీ చేశాడు. ఆ తర్వాత నిజం, వర్షం సినిమాల్లో కూడా పవర్ ఫుల్ విలన్ రోల్స్ చేసి అందరినీ మెప్పించాడు. మూడు సినిమాలు కూడా ఆయనకు మంచి పేరు తెచ్చాయి.జయం సినిమా కు బెస్ట్ విలన్ గా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న గోపీచంద్… నిజం, వర్షం సినిమాలకు కూడా బెస్ట్ విలన్ గా మా టీవీ అవార్డ్స్ అందుకున్నాడు.