Vijayashanthi : చిరంజీవితో గొడవలపై క్లారిటీ ఇచ్చిన వైజయంతి..!
Vijayashanthi : ఒకప్పటి నటి స్టార్ హీరోయిన్ విజయశాంతి తెలుగు ప్రేక్షకులందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రానిచ్చిన విజయశాంతి ఆ తర్వాత పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా స్టార్ట్ చేశారని చెప్పాలి. హీరో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన విజయశాంతి ఆ సినిమాతో తన సెకండ్ ఇన్ని స్టార్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో ఆమెకు మంచి మార్కులు పడ్డాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆమె అడపాదడప సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నారు. అలాగే పలు రకాల చానల్స్ కు యూట్యూభ్స్ కు ఆమె ఇంటర్వ్యలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి తన సినీ జీవితం గురించి రాజకీయ జీవితం గురించి , అలాగే తాను నటించిన హీరోల గురించి మీడియాతో చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో నాకు చాలా మర్యాద ఇచ్చేవారని , ఏ ఇండస్ట్రీకి వెళ్ళిన మహిళలకు మంచి గౌరవం లభించేదని ఆమె చెప్పుకొచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూ చేసిన యాంకర్ మీరు నటించిన హీరోలతో టచ్ లోనే ఉన్నారా అని అడిగినప్పుడు ఆమె మాట్లాడుతూ…రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత చాలా బిజీగా మారానని , ఈ క్రమంలోనే ఎవరిని కలిసేందుకు సమయం దొరకడం లేదని చెప్పుకొచ్చింది. అయితే విజయశాంతి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలు చేసిన హీరోలు బాలకృష్ణ చిరంజీవి అని చెప్పాలి. అయితే బాలకృష్ణ చిరంజీవి కూడా రాజకీయాల్లో ఉండడం వలన కొన్ని విభేదాల కారణంగా కూడా సరిగా కలవలేకపోతున్నట్లుగా ఆమె తెలియజేశారు. అంటే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ప్రత్యర్ధులుగా ఉన్న చిరంజీవి బాలకృష్ణ మధ్య కూడా కాస్త విభేదాలు వచ్చినట్లుగా ఆమె చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎంతో సక్సెస్ సాధించిన విజయశాంతి ఈతరం స్టార్ హీరోయిన్స్ కి ఆదర్శం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే విజయశాంతి , విజయశాంతి అంటేనే లేడీ ఓరియంటెడ్ సినిమా అనేలా ఆమె నటనతో అందర్నీ ఆకట్టుకుంది.
అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేయటం మొదలు పెట్టింది కూడా విజయశాంతి అని చెప్పాలి. ఇలా విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎన్నో చేసి పెద్ద ఎత్తున సక్సెస్ కూడా అయింది. ఆమె చేసిన కొన్ని లేడి ఓరియంటెడ్ మూవీస్ అయితే ఇప్పటికీ ప్రజలు ఆదరిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలాంటి సినిమాల్లో మొదటి స్థానంలో ఉండేది “ఒసేయ్ రావులమ్మ” అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఆమె పాత్రను మరేవరు పోషించలేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు తాను నటించిన హీరోలతో కాస్త విభేదాలు వచ్చాయని చెప్పడంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
This website uses cookies.