Rajamouli : రాజమౌళి – మహేష్ కాంబో.. పొరపాటున పాయింట్ లీక్ చేసిన విజయేంద్ర ప్రసాద్

Authored By vamana sai | The Telugu News | Updated on : 6 July 2021, 1:15 pm

Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఒక సినిమా చేయాలనుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ 4 ఏళ్ళ నుంచి నానుతూనే ఉంది. అయితే బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెక్కలన్నీ మారిపోయాయి. ఇప్పుడు రాజమౌళి పాన్ ఇండియన్ డైరెక్టర్. ఆయన ప్లాన్ చేస్తున్న సినిమాలు పాన్ ఇండియన్ స్థాయిలో ఉంటున్నాయి. ఆయన తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా కథను అలానే తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ – రాం చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న రాజమౌళి దీని చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

vijayendra prasad leaked rajamouli mahesh Babu combo Movie

vijayendra prasad leaked rajamouli mahesh Babu combo Movie

అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి – మహేష్ కాంబోలో పాన్ ఇండియన్ సినిమా మొదలవబోతోంది. కానీ దీనికి చాలా సమయం పట్టేలా ఉంది. అందుకు కారణం ఇంకా పూర్తి స్థాయిలో కథ సిద్దం కాకపోవడమే. అయితే ముందు ఈ కాంబినేషన్ కమిటయినప్పుడు పాన్ ఇండియన్ సినిమా అనేది లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయి అందరు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు రాజమౌళి – మహేష్ కాంబోకి పాన్ ఇండియన్ స్థాయిలో కథ రెడీ చేయాల్సి ఉంది. ఇక అటు రాజమౌళి, ఇటు మహేష్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించడం చాలా కష్టం. అందుకే కథ విషయంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కొన్ని నెలలుగా చాలా కసరత్తులు చేస్తున్నారట.

Rajamouli : ఆఫ్రికన్ జంగిల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ సాగుతుందని చెప్పుకొచ్చాడు.

vijayendra prasad leaked rajamouli mahesh Babu combo Movie

vijayendra prasad leaked rajamouli mahesh Babu combo Movie

అయితే ఆయన రాజమౌళి – మహేష్ కాంబోకి ఎలాంటి కథ రెడీ చేస్తున్నారో పాయింట్ లీక్ చేసినట్టు ప్రచారం అవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా కథ భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దాంతో నిర్మాత అవి వట్టి రూమర్స్ అని కొట్టిపారేశాడు. కానీ తాజాగా విజయేంద్ర ప్రసాద్ అందులో కొంత నిజముందని ఆఫ్రికన్ జంగిల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ సాగుతుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు దీనికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉందని తెలిపాడు. ఆర్ఆర్ఆర్ పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ పూర్తి స్థాయిలో మొదలవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో చేస్తున్నాడు. దీనితో పాటు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నాడు.

ఇది కూడా చ‌ద‌వండి ==> వైవాహిక జీవితంపై నెటిజన్ ప్రశ్న.. షాకింగ్ రిప్లయి ఇచ్చిన నిహారిక..?

ఇది కూడా చ‌ద‌వండి ==> నువ్వు మంచం రెడీ చేసుకో అనసూయ.. చంపేస్తా ఆది.. స్టేజ్ మీదే హైపర్ ఆదికి సీరియస్ వార్నింగ్?

ఇది కూడా చ‌ద‌వండి ==> హంసల మెరిసిపోతున్న అక్కినేని కోడలు సమంత.. లేటేస్ట్ ఫిక్స్ వైర‌ల్‌

vamana sai

No bio available for this author.

  1. "Sprouted Green Gram : కోడిగుడ్లు, పాలకంటే ఎక్కువ ప్రొటీన్.. ఈ సూపర్ ఫుడ్ తెలుసా?.. రోజూ గుప్పెడు చాలు!"

  2. "Fennel Water : డయాబెటిస్ ఉన్నవారికి ఈ నీరు వరమా?.. రోజూ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

  3. "Tirumala : తిరుమలలో రూమ్ దొరకలేదా? అయితే నిరాశ చెందొద్దు.. టీటీడీ ఉచితంగా అందిస్తున్న ఈ సదుపాయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!"

  4. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

  5. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

  6. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

  7. "Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొత్త అడుగు.. రాజకీయాల్లో మరో సంచలనం?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp