Anasuya : నువ్వు మంచం రెడీ చేసుకో అనసూయ.. చంపేస్తా ఆది.. స్టేజ్ మీదే హైపర్ ఆదికి సీరియస్ వార్నింగ్?
Anasuya : యాంకర్ అనసూయ గురించి తెలుసు కదా. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. బుల్లితెర మీద తను టాప్ యాంకర్. తనకు ఉన్న క్రేజే వేరు. బుల్లితెర మీద తను ఏ షోలో అడుగు పెడితే ఆ షో సూపర్ సక్సెస్ అయినట్టే. ప్రస్తుతం జబర్దస్త్ సూపర్ సక్సెస్ అయిందంటే దాంట్లో అనసూయ పాత్ర మరువలేనిది. అందుకే అనసూయ కోసం ఎన్నో షోలు ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాయి. చాలామంది జబర్దస్త్ ను చూస్తున్నారంటే దానికి కారణం కూడా అనసూయే. అయితే.. అనసూయ మీద జబర్దస్త్ లో పంచ్ లు వేయాలంటే హైపర్ ఆది తర్వాతనే ఎవ్వరైనా. హైపర్ ఆది వేసే పంచులకు అనసూయ కూడా బాగానే నవ్వుతుంది. పెద్దగా పట్టించుకోదు. కానీ.. తాజాగా విడుదలైన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో చూస్తే మాత్రం మీరే షాక్ అవుతారు.

anchor anasuya and hyper aadi in jabardasth latest promo
ప్రస్తుతం జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానికి కారణం అనసూయ.. హైపర్ ఆదిపై సీరియస్ కావడమే. మామూలుగా ప్రతి స్కిట్ లోనూ హైపర్ ఆది.. అనసూయ కోసం కొన్ని డైలాగ్ లు రాసుకుంటాడు. తన మీద వేస్తాడు. వాటిని అను కూడా లైట్ తీసుకుంటుంది. కానీ.. ఈసారి మాత్రం లైట్ తీసుకోలేదు. చంపేస్తా.. అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేసింది.

anchor anasuya and hyper aadi in jabardasth latest promo
Anasuya : అనసూయ వార్నింగ్ తో బెదిరిపోయిన హైపర్ ఆది
హైపర్ ఆది స్కిట్ లో భాగంగా.. సీరియల్ నటి రోహిణి కూడా వచ్చింది. అలాగే మరో అమ్మాయి కూడా వచ్చింది. నీతో బ్రేక్ ఫాస్ట్ చేస్తా అంటూ ఆ అమ్మాయిని పడేశాడు ఆది. నీతో లంచ్ చేస్తా అంటూ రోహిణిని పడేశాడు. ఇక.. అనసూయ వంతు వచ్చేసరికి.. నీతో డిన్నర్ చేస్తా.. అని అనబోయే సరికి.. చంపేస్తా.. అని అనేసింది అనసూయ. అను అలా అనేసరికి.. హైపర్ ఆదికి ఏం చేయాలో కూడా పాలుపోలేదు. అనసూయ అలా అంటుందని కూడా హైపర్ ఆది ఊహించలేదు కాబోలు. వెంటనే తన స్కిట్ లో డైలాగ్ లు మార్చేశాడు ఆది. ప్రస్తుతం జబర్దస్త్ ప్రోమోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా.. అనసూయ.. ఆదికి కరెక్ట్ గా సమాధానం చెప్పింది. మంచిగా వార్నింగ్ ఇచ్చింది అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి ==> Anasuya : టాప్ రెడ్ డ్రస్‌తో.. మేడలో డిఫరెంట్ ఆర్నమెంట్ తో హాట్ హాట్ ఫోజులతో అనసూయ
ఇది కూడా చదవండి ==> హంసల మెరిసిపోతున్న అక్కినేని కోడలు సమంత.. లేటేస్ట్ ఫిక్స్ వైరల్
ఇది కూడా చదవండి ==> రకుల్ నాగార్జునతో చేసే సగం కెరీర్ దెబ్బతింది..ఇప్పుడు బాలయ్యతో అంటే..?
ఇది కూడా చదవండి ==> మెహ్రీన్ కంటే ముందు పెళ్లి వరకు వచ్చి విడిపోయిన 14 సినీ జంటల లిస్ట్ ఇదే