vijayendra prasad leaked rajamouli mahesh Babu combo Movie
Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఒక సినిమా చేయాలనుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ 4 ఏళ్ళ నుంచి నానుతూనే ఉంది. అయితే బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెక్కలన్నీ మారిపోయాయి. ఇప్పుడు రాజమౌళి పాన్ ఇండియన్ డైరెక్టర్. ఆయన ప్లాన్ చేస్తున్న సినిమాలు పాన్ ఇండియన్ స్థాయిలో ఉంటున్నాయి. ఆయన తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా కథను అలానే తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ – రాం చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న రాజమౌళి దీని చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
vijayendra prasad leaked rajamouli mahesh Babu combo Movie
అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి – మహేష్ కాంబోలో పాన్ ఇండియన్ సినిమా మొదలవబోతోంది. కానీ దీనికి చాలా సమయం పట్టేలా ఉంది. అందుకు కారణం ఇంకా పూర్తి స్థాయిలో కథ సిద్దం కాకపోవడమే. అయితే ముందు ఈ కాంబినేషన్ కమిటయినప్పుడు పాన్ ఇండియన్ సినిమా అనేది లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయి అందరు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు రాజమౌళి – మహేష్ కాంబోకి పాన్ ఇండియన్ స్థాయిలో కథ రెడీ చేయాల్సి ఉంది. ఇక అటు రాజమౌళి, ఇటు మహేష్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించడం చాలా కష్టం. అందుకే కథ విషయంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కొన్ని నెలలుగా చాలా కసరత్తులు చేస్తున్నారట.
vijayendra prasad leaked rajamouli mahesh Babu combo Movie
అయితే ఆయన రాజమౌళి – మహేష్ కాంబోకి ఎలాంటి కథ రెడీ చేస్తున్నారో పాయింట్ లీక్ చేసినట్టు ప్రచారం అవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా కథ భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దాంతో నిర్మాత అవి వట్టి రూమర్స్ అని కొట్టిపారేశాడు. కానీ తాజాగా విజయేంద్ర ప్రసాద్ అందులో కొంత నిజముందని ఆఫ్రికన్ జంగిల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ సాగుతుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు దీనికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉందని తెలిపాడు. ఆర్ఆర్ఆర్ పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ పూర్తి స్థాయిలో మొదలవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో చేస్తున్నాడు. దీనితో పాటు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నాడు.
ఇది కూడా చదవండి ==> వైవాహిక జీవితంపై నెటిజన్ ప్రశ్న.. షాకింగ్ రిప్లయి ఇచ్చిన నిహారిక..?
ఇది కూడా చదవండి ==> నువ్వు మంచం రెడీ చేసుకో అనసూయ.. చంపేస్తా ఆది.. స్టేజ్ మీదే హైపర్ ఆదికి సీరియస్ వార్నింగ్?
ఇది కూడా చదవండి ==> హంసల మెరిసిపోతున్న అక్కినేని కోడలు సమంత.. లేటేస్ట్ ఫిక్స్ వైరల్
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
This website uses cookies.