Gopichand – Radhakrishna : ఫ్లాపుల్లో ఉన్న హీరో – దర్శకుడు ఒక్కటైతే హిట్టు పడుతుందా..? అంటే అది ఎంచుకున్న కథ, దాన్ని సినిమాగా తీసిన తర్వాత చూసిన ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. కథ అద్భుతంగా ఉంటే ఫ్లాపుల్లో ఉన్న హీరో – దర్శకుడు ఒక్కటై భారీ హిట్ సాధించవచ్చు. దీనికి ఉదాహరణ అఖండ. నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత వరుసగా 5 సినిమాలు ఫ్లాపుగా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద బాలయ్య సినిమాలు బోల్తా పడుతుంటే ఇక ఆయన పని అయిపోయిందనే కామెంట్స్ కూడా వినిపించాయి.
దర్శకుడు బోయపాటి శ్రీను కూడా అంతే. ఆయన తీసిన వినయ విధేయ రామ, జయ జానకీ నాయక సినిమాలు ఫ్లాపవడంతో మళ్ళీ సినిమా చేయాలంటే ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యతో కలిస్తేనే హిట్ కొట్టగలనని భావించి అఖండ లాంటి అద్భుతమైన కథను రాసుకొని దాన్ని బాలయ్యకు చెప్పి ఒప్పించి ఇద్దరు కలిసి కసితో సినిమా చేసి అఖండ విజయాన్ని అందుకున్నారు. ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్న వారే కావడంతో సినిమా సక్సెస్ కోసం ఎంతో శ్రమించారు. ఆ శ్రమ వృధా కాలేదు. అభిమానులు, ప్రేక్షకులను మెప్పించారు. కాబట్టే వీరికి హిట్ దక్కింది.
అయితే, ఇప్పుడు ఇలాంటి మరో ఫ్లాప్ కాంబినేషన్ కలిసి మళ్లీ సినిమా చేయబోతున్నారని తాజా సమాచారం. వారే మాచో హీరో గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ రాధకృష్ణ కుమార్. వీరిద్దరు కలిసి చేసిన సినిమా జిల్. ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. దర్శకుడికి ఇది మొదటి సినిమా.
రెండవ సినిమా రాధే శ్యామ్. గ్లోబల్ స్టార్ ప్రభాస్‌తో తీసిన ఈ సినిమా 100 కోట్లకు పైగానే నిర్మాతలకు నష్ఠాలను మిగిల్చింది. దాంతో ఇప్పుడు ఈ దర్శకుడికి వేరే హీరోలు ఛాన్సులు ఇవ్వడం లేదని టాక్. దాంతో మళ్ళీ గోపీచంద్ హీరోగా సినిమా చేసి హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. దీని తర్వాత కొత్త ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.