Vishnu Priya : పెద్ద కంటెస్టెంట్‌కే ఎస‌రు పెట్టారుగా.. విష్ణు ప్రియ ప‌రిస్థితి ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishnu Priya : పెద్ద కంటెస్టెంట్‌కే ఎస‌రు పెట్టారుగా.. విష్ణు ప్రియ ప‌రిస్థితి ఏంటి?

Vishnu Priya : బుల్లితెర ప్రేక్ష‌కులని ఎంత‌గానో అల‌రిస్తున్న అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. గత సీజన్లతో పోల్చితే ఈసారి హౌస్ లోకి పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్స్ వచ్చినా తమ దైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. ఇక వీకెండ్ లో బిగ్ బాస్ ఎంటర్ టైన్మెంట్ మరో లెవెల్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి తోడు ఈసారి వినాయక చవితి పండగ కూడా వచ్చింది. దీంతో శని, ఆదివారాల్లో బిగ్ బాస్ ఎంటర్‌ […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 September 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Vishnu Priya : పెద్ద కంటెస్టెంట్‌కే ఎస‌రు పెట్టారుగా.. విష్ణు ప్రియ ప‌రిస్థితి ఏంటి?

Vishnu Priya : బుల్లితెర ప్రేక్ష‌కులని ఎంత‌గానో అల‌రిస్తున్న అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. గత సీజన్లతో పోల్చితే ఈసారి హౌస్ లోకి పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్స్ వచ్చినా తమ దైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. ఇక వీకెండ్ లో బిగ్ బాస్ ఎంటర్ టైన్మెంట్ మరో లెవెల్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి తోడు ఈసారి వినాయక చవితి పండగ కూడా వచ్చింది. దీంతో శని, ఆదివారాల్లో బిగ్ బాస్ ఎంటర్‌ టైన్మెంట్ మంచి జోరు మీద ఉండనుంది. ఇక ఆదివారం ఫన్‌ తో పాటు ఎలిమినేషన్ కూడా ఉండనుంది. కాగా ఈసారి ఫస్ట్ వీక్ లోనే షాకింగ్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

Vishnu Priya అంతా స‌స్పెన్స్..

హౌస్ లో ఏడుపులతో సింపతీ కార్డ్ ప్లే చేస్తోన్న నాగ మణికంఠ టాప్-2 లోకి దూసుకురావడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. బిగ్ బాస్ షో ప్రారంభమైనప్పటి నుంచే నాగ మణికంఠ పేరు బాగా వినిపిస్తోంది. నెట్టింట కూడా అతని పేరు బాగా వైరల్ అవుతూనే ఉంది. అదే ఇప్పుడు ఓటింగ్స్ లో కూడా కనిపిస్తోంది. శుక్రవారం రాత్రితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయి. అలా ఈ వారం ఓటింగ్ సరళని ఒకసారి గమనిస్తే.. స్టార్ యాంకర్ విష్ణుప్రియ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఈ సారి కంటెస్టెంట్స్ లో మోస్ట్ పాపులర్ ఆమె కాబట్టి ఆ ప్రభావం ఓటింగ్ లోనూ కనిపిస్తోంది. ఇక రెండో ప్లేస్ లో నాగ మణికంఠ కొనసాగుతున్నాడు. ఇక మూడో స్థానంలో పృథ్వీ రాజ్, నాలుగో స్థానంలో సోనియా ఆకుల, ఐదో స్థానంలో ఆర్జే శేఖర్ బాషా, ఆఖరి ప్లేస్ లో బెజవాడ బేబక్క ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ప్రస్తుతానికి వీళ్లిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

Vishnu Priya పెద్ద కంటెస్టెంట్‌కే ఎస‌రు పెట్టారుగా విష్ణు ప్రియ ప‌రిస్థితి ఏంటి

Vishnu Priya : పెద్ద కంటెస్టెంట్‌కే ఎస‌రు పెట్టారుగా.. విష్ణు ప్రియ ప‌రిస్థితి ఏంటి?

ఆర్జే శేఖర్ బాషా కొంచెం దూకుడుతో ఆట ఆడుతున్నాడు కాబట్టి బెజవాడ బేబక్క పెట్టె సర్దుకోవాల్సి వస్తుందేమోనని తెలుస్తోంది. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు మాత్రం శేఖర్ వేసే డైలాగులకి ద్యావుడా అంటూ తలలు బాదుకుంటున్నారు. బన్నుని గరం చేస్తే ఏమవుతుంది తెలుసా బంగారం అవుతుంది, రాత్రి పూటే మూడ్ ఎందుకొస్తుందో తెలుసా త్రి అంటే మూడు కదా మరి రా.. త్రి అంటే మూడ్ రాకుండా ఉంటుందా, ముంబాయ్ మా మేనమామ ఇల్లు.. ముం అంటే అమ్మ, బాయ్ అంటే అన్నయ్య సో ముంబాయ్ అంటే మేనమామ ఇల్లు.. అంటూ పిచ్చిపిచ్చిగా శేఖర్ వేసే ఆటో పంచులకి జుట్టు పీక్కుంటున్నారు కంటెస్టెంట్లు. ఇక వీటిని సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది