Vishnu Priya : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. గత సీజన్లతో పోల్చితే ఈసారి హౌస్ లోకి పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్స్ వచ్చినా తమ దైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. ఇక వీకెండ్ లో బిగ్ బాస్ ఎంటర్ టైన్మెంట్ మరో లెవెల్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి తోడు ఈసారి వినాయక చవితి పండగ కూడా వచ్చింది. దీంతో శని, ఆదివారాల్లో బిగ్ బాస్ ఎంటర్ టైన్మెంట్ మంచి జోరు మీద ఉండనుంది. ఇక ఆదివారం ఫన్ తో పాటు ఎలిమినేషన్ కూడా ఉండనుంది. కాగా ఈసారి ఫస్ట్ వీక్ లోనే షాకింగ్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
హౌస్ లో ఏడుపులతో సింపతీ కార్డ్ ప్లే చేస్తోన్న నాగ మణికంఠ టాప్-2 లోకి దూసుకురావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. బిగ్ బాస్ షో ప్రారంభమైనప్పటి నుంచే నాగ మణికంఠ పేరు బాగా వినిపిస్తోంది. నెట్టింట కూడా అతని పేరు బాగా వైరల్ అవుతూనే ఉంది. అదే ఇప్పుడు ఓటింగ్స్ లో కూడా కనిపిస్తోంది. శుక్రవారం రాత్రితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయి. అలా ఈ వారం ఓటింగ్ సరళని ఒకసారి గమనిస్తే.. స్టార్ యాంకర్ విష్ణుప్రియ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఈ సారి కంటెస్టెంట్స్ లో మోస్ట్ పాపులర్ ఆమె కాబట్టి ఆ ప్రభావం ఓటింగ్ లోనూ కనిపిస్తోంది. ఇక రెండో ప్లేస్ లో నాగ మణికంఠ కొనసాగుతున్నాడు. ఇక మూడో స్థానంలో పృథ్వీ రాజ్, నాలుగో స్థానంలో సోనియా ఆకుల, ఐదో స్థానంలో ఆర్జే శేఖర్ బాషా, ఆఖరి ప్లేస్ లో బెజవాడ బేబక్క ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ప్రస్తుతానికి వీళ్లిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
ఆర్జే శేఖర్ బాషా కొంచెం దూకుడుతో ఆట ఆడుతున్నాడు కాబట్టి బెజవాడ బేబక్క పెట్టె సర్దుకోవాల్సి వస్తుందేమోనని తెలుస్తోంది. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు మాత్రం శేఖర్ వేసే డైలాగులకి ద్యావుడా అంటూ తలలు బాదుకుంటున్నారు. బన్నుని గరం చేస్తే ఏమవుతుంది తెలుసా బంగారం అవుతుంది, రాత్రి పూటే మూడ్ ఎందుకొస్తుందో తెలుసా త్రి అంటే మూడు కదా మరి రా.. త్రి అంటే మూడ్ రాకుండా ఉంటుందా, ముంబాయ్ మా మేనమామ ఇల్లు.. ముం అంటే అమ్మ, బాయ్ అంటే అన్నయ్య సో ముంబాయ్ అంటే మేనమామ ఇల్లు.. అంటూ పిచ్చిపిచ్చిగా శేఖర్ వేసే ఆటో పంచులకి జుట్టు పీక్కుంటున్నారు కంటెస్టెంట్లు. ఇక వీటిని సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.