Vishnu Priya : అవకాశాల కోసం పడుకుంటే తప్పేంటి.. యాంకర్ విష్ణు ప్రియ కామెంట్స్ వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 11, 2022, 7:00 pm

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియను ఇప్పుడు టచ్ చేసే పరిస్థితి కూడా లేదు. తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా తనకు ప్రస్తుతం చాలా ఆఫర్స్ వస్తున్నాయి. తనకు వరుసగా సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. నిజానికి విష్ణుప్రియ అంటేనే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తనకు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సోషల్ మీడియాలో తనకు ఉన్న రేంజ్ మామూల్ది కాదు. ఆ తర్వాత తను యాంకరింగ్ వైపు మళ్లింది.

ఈటీవీలో పోవేపోరా అనే షోతో సుధీర్ సరసన కో యాంకర్ చేసి తగిన గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి నుంచి విష్ణుప్రియ ఫేమస్ అయింది. యాంకరింగ్ లోనే తనకు చాలా అవకాశాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. యాంకర్ గానే కాకుండా తనకు సినిమాల్లోనూ అవకాశాలు వస్తుండటంతో తను స్టార్ అయిపోయింది. అయితే.. విష్ణు ప్రియ కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలేనట. తను ఇటీవల వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

Vishnu Priya comments on casting couch

Vishnu Priya comments on casting couch

Vishnu Priya : నేనూ కాస్టింగ్ కౌచ్ బాధను ఎదుర్కున్నా?

అయితే… ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణుప్రియ కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది. నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. కానీ.. నేను మాత్రం ఎలాంటి కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. ఒకవేళ ఇరువురి మధ్య ఇష్టంతో కమిట్ మెంట్స్ జరిగితే దాంట్లో తప్పేముంటుంది. దాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరూ బలవంతం అయితే చేయరు కదా. అటువంటప్పుడు దాన్ని తప్పుగా ఎందుకు భావించాలి. ఇక్కడ ఇద్దరికీ ఇష్టం లేకుండా పని జరగడం లేదు కదా అంటూ చెప్పుకొచ్చింది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp