Vishnu Priya : న‌వ‌మి రోజు నాభి అందాలు చూపిస్తూ విష్ణు ప్రియ ర‌చ్చ‌.. ట్రోల్స్ చేస్తున్న నెటిజ‌న్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishnu Priya : న‌వ‌మి రోజు నాభి అందాలు చూపిస్తూ విష్ణు ప్రియ ర‌చ్చ‌.. ట్రోల్స్ చేస్తున్న నెటిజ‌న్స్

Vishnu Priya : పోవే పోరా షోతో యాంక‌ర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది విష్ణు ప్రియ‌. ఈ క్రేజ్ కొన్నాళ్లు మాత్ర‌మే పని చేసింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియానే న‌మ్ముకుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. తెగ అందాలు ఆర‌బోస్తూ సోష‌ల్ మీడియాలో నానా ర‌చ్చ చేస్తుంది. ఒక‌ప్పుడు న‌టిగా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన విష్ణు ప్రియ ఇప్పుడు యాంకర్‌గా, కొన్ని వెబ్ సిరీస్‌ల‌లో న‌టిగాను అల‌రిస్తూ వ‌స్తుంది. విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి అందరికీ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :10 April 2022,8:30 pm

Vishnu Priya : పోవే పోరా షోతో యాంక‌ర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది విష్ణు ప్రియ‌. ఈ క్రేజ్ కొన్నాళ్లు మాత్ర‌మే పని చేసింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియానే న‌మ్ముకుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. తెగ అందాలు ఆర‌బోస్తూ సోష‌ల్ మీడియాలో నానా ర‌చ్చ చేస్తుంది. ఒక‌ప్పుడు న‌టిగా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన విష్ణు ప్రియ ఇప్పుడు యాంకర్‌గా, కొన్ని వెబ్ సిరీస్‌ల‌లో న‌టిగాను అల‌రిస్తూ వ‌స్తుంది. విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. ఇక ఆమె తన క్రష్ గురించి చెప్పిన విషయాలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.ఓ సారి సుమ క్యాష్ షోలో విష్ణుప్రియ చెప్పిన విశేషాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

విష్ణుప్రియకు ఇష్టమైన సెలెబ్రిటీల గురించి శ్రీముఖి నోరు విప్పారు. అలా విష్ణుప్రియ క్రష్ ఎవరో, ఎవరి మీద ప్రేమ ఉందో అన్ని విషయాలు బయటకు వచ్చాయి. విష్ణుప్రియకు నవదీప్ అంటే పిచ్చి అని. అతని ఇంటికి కూడా వెళ్లిందని శ్రీముఖి చెప్పేశారు. నవదీప్ అంటే క్రష్ అని విష్ణుప్రియ కూడా చెప్పేశారు. అయితే ఈ అమ్మ‌డు వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు రేపుతుంది. విష్ణుప్రియ ఫోటోలు చూసినవారు… ఆమె యాంకర్ అంటే నమ్మే స్థితిలో లేరు. గ్లామర్ హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు అమ్మడు సోషల్ మీడియా ఫోజులు ఉంటున్నాయి.శ్రీరామ‌న‌వ‌మి పండ‌గ రోజు నాభి అందాలు చూపిస్తూ నానా ర‌చ్చ చేసింది విష్ణు ప్రియ‌.

vishnu priya trolled by her fans

vishnu priya trolled by her fans

Vishnu Priya : విష్ణు ప్రియ రెచ్చిపోయిందిగా..

ఈమె చేసిన‌ర‌చ్చ చూసి నెటిజ‌న్స్ తిట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. పండ‌గ రోజు కూడా ప‌ద్ద‌తిగా ఉండేది లేదా, ఏంది ఈ ర‌చ్చ అంటూ తెగ తిట్టేస్తున్నారు. యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి, బుల్లితెర యాంకర్ గా మారిన విష్ణుప్రియ, వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. అడపాదడపా పాత్రలు కూడా చేస్తున్న ఈ అమ్మడు, ఓ మూవీలో సూపర్ హాట్ గా కనిపించారు. హీరోయిన్ గా విస్తృత అవకాశాలు ఉన్న నేపథ్యంలో, తమ గ్లామర్ చూపించి దర్శక నిర్మాతలకు సందేశం పంపుతున్నారు విష్ణుప్రియ. అవకాశం ఇస్తే వెండితెరపై బోల్డ్ రోల్స్ కి అయినా సిద్దమే అన్నట్లు ఉంది విష్ణుప్రియ తీరు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది