Vishnu Priya : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు బిగ్ బాస్. ప్రస్తుతం తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది. ఈ షో రోజు రోజుకి మరింత రసవత్తరంగా మారుతుంది. 14 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 లో నలుగురు ఎలిమినేట్ అయ్యారు. హౌజ్‌లో 10 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. మొదటి వారం సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. వరుసగా శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఇంటి బాట పట్టారు. ఆదివారం సోనియా ఎలిమినేట్ కాగా… సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. తగు కారణాలు చెప్పి ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. నామినేట్ చేసిన కంటెస్టెంట్ ఫోటోను మంటల్లో కాల్చి వేయాలి. ఎప్పటిలానే కంటెస్టెంట్స్ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒకరిపై మరొకరు ఫైర్ అయ్యారు.
ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం విష్ణుప్రియ, నిఖిల్, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, నైనిక, నబీల్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ తో పాటు ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని నాగార్జున చెప్పారు. మరి నామినేషన్స్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఇద్దరు ఎలిమినేట్ అవుతారా లేక ఒక్కరే ఈ వారం బయటకు వెళతారా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. అయితే ఈ సీజన్ కి బిగ్ బాస్ హౌస్లో ఉన్న టాప్ సెలెబ్ విష్ణుప్రియ కాగా, ఆమెనే టైటిల్ ఎగరేసుకుపోతుందని అందరు అనుకున్నారు. కాని ఆడియన్స్ విష్ణుప్రియ గేమ్ పట్ల సంతృప్తిగా లేరని తాజా ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. అనూహ్యంగా ఆమెకు తక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయట.
విష్ణుప్రియతో పోల్చుకుంటే నబీల్ ఒక సామాన్యుడు. అతడికి సోషల్ మీడియాలో ఓ మోస్తరు పాపులారిటీ ఉంది. బుల్లితెర ఆడియన్స్ కి నబీల్ ఎవరో తెలియదు. కేవలం తన ఆట తీరుతో నబీల్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడట. నిఖిల్ ని కూడా వెనక్కి నెట్టి టాప్ లో ట్రెండ్ అవుతున్నాడట. నబీల్ తర్వాత నిఖిల్ కి ఓట్లు పడుతున్నాయట. అతడు రెండో స్థానంలో ఉన్నాడట. విష్ణు ప్రియ మూడో స్థానానికి పడిపోయిందట. నబీల్, నిఖిల్ తర్వాత విష్ణుప్రియకు ఓట్లు పడుతున్నాయట. ఇది ఊహించని పరిణామమే అని చెప్పొచ్చు. నాలుగో స్థానంలో మణికంఠ ఉన్నాడట. మణికంఠకు ఆడియన్స్ లో పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ప్రతిసారి నామినేట్ అవుతున్నప్పటికీ ఆడియన్స్ ఓట్లు వేసి సేవ్ చేస్తున్నారు. కాగా ఆదిత్య ఓం, నైనిక చివరి రెండు స్థానాల్లో ఉన్నారట. వీరిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.