Vishwak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఖమ్మంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో విద్యాసాగర్ చింత, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, రుక్సార్ థిల్లాన్, చిత్ర కథారచయిత, షో రన్నర్ రవికిరణ్ కోలా, సంగీత దర్శకుడు జై క్రిష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన విశ్వక్ సేన్.. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్‌తో పాటు బలమైన కథ, సంగీతం, పాటలు సమపాళ్లలో ఉంటాయి.
వయస్సు మీద పడుతున్నా పెళ్లి కాని యువకుడైన అల్లం అర్జున్‌కుమార్ పడే బాధలే ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఫ్రాంక్ వీడియో చేశారు. పబ్లిక్ ప్లేస్‌లో పెట్రోల్ పేసుకున్నట్టుగా తెగ హంగామా చేయడంతో అది పెద్ద న్యూసెన్స్ అయ్యింది. దీంతో ఆ ఇష్యూపై టీవీ 9 ఛానల్‌లో డిబేట్ నిర్వహిస్తూ.. వరుస బ్రేకింగ్‌లు వేయడంతో అదే లైవ్ డిబేట్‌లో పాల్గొన్నాడు హీరో విశ్వక్ సేన్. ఈ డిస్కషన్స్‌లో యాంకర్ దేవి, విశ్వక్ సేన్‌ల మధ్య మాటా మాటా పెరిగింది. పాగల్ సేన్, డిప్రెషన్ పర్సన్ అని యాంకర్ దేవి వ్యాఖ్యలు చేయడంతో విశ్వక్ సేన్‌కి కోపం వచ్చింది.పాగల్ సేన్ అని.. డిప్రెషన్ పర్సన్ అనే హక్కు మీకు లేదు..
నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదంటూ విశ్వక్ సేన్ యాంకర్ దేవికి క్లాస్ పీకాడు. అయితే రెచ్చిపోయిన యాంకర్ దేవి.. అదేదో ఇంగ్లీష్ ఛానల్‌లో యాంకర్ మాదిరిగా గెటౌట్ మై స్టుడియో.. అంటూ విశ్వక్ సేన్‌ని స్టుడియో నుంచి బయటకు పొమ్మన్నది. పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో యువ దర్శకుడు బండి సరోజ్ కుమార్ పరోక్షంగా స్పందిస్తూ.. ‘వాడు మంచోడు కాబట్టి.. F***తో సరిపెట్టాడు. నేనైతే నాలుగు తగిలించేవాడ్ని.. నా నా దృష్టిలో జెండర్ కార్డ్ అనేది జాతి, కులం, మతం కార్డ్స్‌కి ఏ మాత్రం అతీతం కాదు.. ఫస్ట్ మనిషి’ అంటూ యాంకర్ దేవికి ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చాడు బీఎస్‌కె .అయితే దేవి .. మంత్రి తలసానికి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో విశ్వక్‌సేన్‌పై బ్యాన్ పడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.