Vishwak sen : సరి కొత్తగా విశ్వక్ సెన్ “గామి” ప్రెస్ మీట్… 200 కోట్లు పక్కా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishwak sen : సరి కొత్తగా విశ్వక్ సెన్ “గామి” ప్రెస్ మీట్… 200 కోట్లు పక్కా..!

Vishwak sen : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫలక్ నామా దాస్ అనే సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు విశ్వక్ సేన్..అప్పటినుండి ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపద్యంలోనే తాజాగా విశ్వక్ సెన్ “గామి” అనే సినిమాలో నటించడం జరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ కాగా ఇటీవల దీనికి సంబంధించి ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అయితే విశ్వక్ సెన్ “గామి” మూవీ ప్రెస్ మీట్ చాలా కొత్తగా నిర్వహించారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 April 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Vishwak sen : సరి కొత్తగా విశ్వక్ సెన్ "గామి" ప్రెస్ మీట్... 200 కోట్లు పక్కా..!

Vishwak sen : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫలక్ నామా దాస్ అనే సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు విశ్వక్ సేన్..అప్పటినుండి ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపద్యంలోనే తాజాగా విశ్వక్ సెన్ “గామి” అనే సినిమాలో నటించడం జరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ కాగా ఇటీవల దీనికి సంబంధించి ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అయితే విశ్వక్ సెన్ “గామి” మూవీ ప్రెస్ మీట్ చాలా కొత్తగా నిర్వహించారు. ఈ సినిమాను ఎక్కువ శాతం మంచులో షూటింగ్ చేయడం వలన సినిమా ప్రెస్ మీట్ ను అదే తరహాలో ప్లాన్ చేశారు మూవీ టీమ్. ఈ నేపథ్యంలోనే పూర్తిగా మంచుతో కూడుకున్న సెటప్ ను క్రియేట్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. దీంతో విలేకరులు సైతం చలిలో గజగజ వణుకుతూ మూవీకి సంబంధించిన ప్రశ్నలు అడిగారు.

దీనిలో భాగంగా విశ్వక్ సెన్ మాట్లాడుతూ రిపోర్టర్స్ అడిగిన పలు రకాల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓ విలేకరి మీ సక్సెస్ మీట్ అప్పుడు పెద్దలు కూడా మా సినిమాలకు వచ్చి మాట్లాడితే బాగుంటుందని అన్నారు కదా. మీకు ఎన్టీఆర్ కూడా చాలా క్లోజ్. అలాంటప్పుడు వారిని తీసుకువచ్చి ప్రమోషన్స్ చేయవచ్చు కదా అలా కాకుండా ఇలాంటి మాట ఎందుకు వాడారని అడిగాడు. అయితే దీనికి విశ్వక్ సెన్ సమాధానం ఇస్తూ నేను పెద్దోళ్ళు అన్నది సినిమా వాళ్ళ గురించి కాదని మూవీ రివ్యూ రైటర్స్ అందరూ కూడా యంగ్ స్టర్స్ ఉన్నారు కొంతమంది ముసలోళ్ళు కూడా ఉంటే బాగుండేదని చెప్పాను. మీరు పెద్దోళ్ళ అంటే అలా అనుకున్నారా. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అంటూ సమాధానం ఇచ్చారు. నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫలక్ నామా దాస్ కూడా రాలేదు. నేను ఆ టైంలోనే ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయ్యా. ఈ సినిమా ఎక్కువ ఆ సినిమా తక్కువ అనేది ఏమీ లేదు.

Vishwak sen సరి కొత్తగా విశ్వక్ సెన్ గామి ప్రెస్ మీట్ 200 కోట్లు పక్కా

Vishwak sen : సరి కొత్తగా విశ్వక్ సెన్ “గామి” ప్రెస్ మీట్… 200 కోట్లు పక్కా..!

ఇక ఈ సినిమాలో చూస్తే గనుక ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అంటే డాన్స్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు ఐటమ్ సాంగ్ కావచ్చు లేదా ఫైట్స్ కావచ్చు ఇవేమీ లేకుండా నేను ఈ సినిమా చేయడం అనేది చాలా పెద్ద విషయం అది మీకు కూడా తెలుసు. కానీ ఈ సినిమా ఓపెనింగ్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం నిజంగా నా అదృష్టం అంటూ ఈ సందర్భంగా విశ్వక్ తెలియజేశారు.అలాగే మూవీకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను విశ్వక్ ప్రెస్ మీట్ లో విలేకరులతో పంచుకున్నారు.అయితే విశ్వక్ మునుపెన్నడు లేని విధంగా అఘోర పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది