Laila Movie 1st Days Collection : దారుణమైన స్థితిలో లైలా మూవీ కలెక్షన్స్…1st డే ఇలా ఉంటే తరువాత పరిస్థితి ఏంటి…!
ప్రధానాంశాలు:
Laila Movie 1st Days Collection : దారుణమైన స్థితిలో లైలా మూవీ కలెక్షన్స్...1st డే ఇలా ఉంటే తరువాత పరిస్థితి ఏంటి...!
Laila Movie 1st Days Collection : తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ Vishwak Sen రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైలా Laila Movie . ఈ మూవీలో విశ్వక్సేన్ లేడీ గెటప్ లో అలరించబోతున్నాడు. ఈ సినిమాలు మెయిన్ పాయింట్ బయటికి రావడంతో విడుదలకు ముందే వివాదంలో పడింది. ట్రైలర్ టీజర్ల తో ఈ సినిమా హైప్ క్రియేట్ చేయగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వి రాజ్ చేసిన కామెంట్లు వివాదాస్పందనగా మారాయి. దీంతో వైసిపి క్యాడర్ ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ప్రచారాలు చేసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా క్షత్రియ యూనిట్ మరియు నటుడు పృథ్వీరాజ్ వైసీపీకి క్షమాపణలు తెలిపారు.

Laila Movie 1st Days Collection : దారుణమైన స్థితిలో లైలా మూవీ కలెక్షన్స్…1st డే ఇలా ఉంటే తరువాత పరిస్థితి ఏంటి…!
వీటన్నిటిని దాటుకొని విశ్వక్ నటించిన లైలా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయిందని చెప్పాలి. అంతేకాకుండా సినిమాలో అసలు మంచి కథ లేదంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే కథ మరియు కథనం రెండు కూడా ఏమాత్రం బాగోలేదంటూ వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా పాత తరం , అర్థం లేని హాస్యం, మొత్తం మీద లైలా సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిందనే చెప్పుకోవచ్చు.అంతేకాకుండా లైలా సినిమా కలెక్షన్స్ సైతం సిని బృందాన్ని నిరాశపరిచాయని చెబుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లు కూడా సినిమాకు అనుకున్నంత రాలేదని కేవలం ఒక్క రోజులో 8 వేల టికెట్లు అమ్ముడుపోయినట్లుగా చెబుతున్నారు.
ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 80 లక్షల రేంజ్ కి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే లైలా మూవీ తో విశ్వక్ సెన్ కి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా విశ్వక్ సెన్ మస్ కా దాస్ ,గామి, మరియు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకోని భారీ రాబడిని సొంతం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన మెకానిక్ రాకి సినిమా నిరాశ కలిగించింది. ప్రస్తుతం వచ్చిన లైలా కూడా దానికన్నా తక్కువ ఓపెనింగ్స్ ను రాబట్టింది. అయితే లైలా సినిమా దాదాపు 35 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. దీంతో కనీసం ఆ పెట్టుబడి అయిన రాబడితే అదే గొప్ప అన్నట్లుగా ఈ సినిమా పరిస్థితి కనిపిస్తుంది అని విశ్లేషకులు చెబుతున్నారు.