Laila Movie : పాపం విశ్వక్ సేన్.. ట్రెండింగ్ లోకి వచ్చిన డిజాస్టర్ లైలా హ్యాష్ ట్యాగ్..!
ప్రధానాంశాలు:
Laila Movie : పాపం విశ్వక్ సేన్.. ట్రెండింగ్ లోకి వచ్చిన డిజాస్టర్ లైలా హ్యాష్ ట్యాగ్..!
Laila Movie : విశ్వక్ సేన్ vishwak sen నటించిన లైలా సినిమాకి Laila Movie బాయ్ కాట్ ఎఫెక్ట్ బాగా తగిలింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ pravidhi raj చేసిన కామెంట్స్‌తో “లైలా” సినిమాని బాయ్ కాట్ చెయ్యాలని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పిలుపు ఇవ్వడంతో ఇప్పటికే హీరో విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పాడు. అయితే, క్షమాపణ చెప్పాల్సింది హీరో కాదు కామెంట్లు చేసిన పృథ్వీ అంటూ మళ్ళీ ట్రెండ్ కావడంతో ఆ కమెడియన్ సినిమా బాగు కోసం ముందుకొచ్చారు. “నా వల్ల సినిమా దెబ్బతినకూడదు అందరికీ క్షమాపణలు చెపుతున్నాను,” అని ఒక వీడియో విడుదల చేశారు.

Laila Movie : పాపం విశ్వక్ సేన్.. ట్రెండింగ్ లోకి వచ్చిన డిజాస్టర్ లైలా హ్యాష్ ట్యాగ్..!
Laila Movie పెద్ద దెబ్బే..
అయిన వైసీపీ వాళ్లు శాంతించేలా కనిపించడం లేదు. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా పూర్తి డిజాస్టర్ గా నిలిచింది. వైసీపీ అభిమానుల దెబ్బకు బోల్తా కొట్టిందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.దీనికి తోడు డిజాస్టర్ లైలా అంటూ పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేస్తున్నారు. సినిమా విడుదల కాకముందే నిన్న రాత్రి నుంచి#DisasterLaila అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇకపోతే వైసీపీ అభిమానులు ఈ సినిమా డిజాస్టర్ అని చెప్పకపోయినా సినిమా కంటెంట్ మాత్రం చెత్తగా ఉందని, ఈ సినిమా డిజాస్టర్ అనడంలో ఎటువంటి తప్పు లేదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికైతే భారీ అంచనాల మధ్య వచ్చిన విశ్వక్ సేన్ లైలా మూవీ వైసీపీ ఫ్యాన్స్ దెబ్బకు బోల్తా పడిందని చెప్పవచ్చు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. దీనికి తోడు సెన్సార్ సభ్యులు కూడా A సర్టిఫికెట్ జారీ చేశారు.