Viswak Sen : మళ్లీ గెలికిన హీరో విశ్వక్సేన్ .. వాడి వెనకాల అల్లు అరవింద్, నాగ వంశీ ఉంటే భయపడాలా అంటూ కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viswak Sen : మళ్లీ గెలికిన హీరో విశ్వక్సేన్ .. వాడి వెనకాల అల్లు అరవింద్, నాగ వంశీ ఉంటే భయపడాలా అంటూ కామెంట్స్..!

 Authored By anusha | The Telugu News | Updated on :1 January 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Viswak Sen : మళ్లీ గెలికిన హీరో విశ్వక్సేన్ .. వాడి వెనకాల అల్లు అరవింద్, నాగ వంశీ ఉంటే భయపడాలా అంటూ కామెంట్స్..!

Viswak Sen : హీరో విశ్వక్సేన్ ఇండస్ట్రీలో సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీలతోనే పాపులర్ అవుతుంటారు.ఈయనకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ కూడా ఉంది.ఈ జనరేషన్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత వేగంగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ హీరోనే. ఇక విశ్వక్సేన్ హీరో గానే కాకుండా దర్శకుడిగా కూడా సత్తా చాటుకున్నారు. ఫలక్నామా దాస్, ధమ్ కీ లాంటి సినిమాలు ఈయనకు డైరెక్టర్గా గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతో ఫేమస్ అవడం ఈ హీరో స్టైల్. అయితే తాజాగా మరో వివాదంలో విశ్వక్సేన్ చిక్కుకునే పరిస్థితి కనిపిస్తోంది. ‘ కల్ట్ ‘ అనే సినిమాను తన నిర్మాణంలో ప్రకటించాడు విశ్వక్సేన్.

అందులో ఆయన హీరో కాదు నిర్మాత మాత్రమే. మరో హీరోతో ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. దీనికి ఆయన కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నాడు కూడా. తాజుద్దీన్ అనే డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఇందులో అంత కొత్త వాళ్లే నటిస్తారని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో నటించాలనుకున్నవారు మెయిల్ ఐడీకి పంపాలని విశ్వక్ ఓ ట్వీట్ కూడా వేశారు. అయితే కల్ట్ కు దగ్గరగా ఉన్న పేరుతో మరో టైటిల్ ఇప్పటికే రిజిస్టర్ అయింది. గత సంవత్సరం బ్లాక్ బస్టర్ అయిన బేబీ సినిమాని నిర్మించిన ఎస్కేఎన్ తన తర్వాతి సినిమాకు కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. తాజాగా విశ్వక్ కూడా కల్ట్ పేరుతో సినిమాను ప్రకటించడం వివాదానికి దారితీస్తుంది.

నిజానికి బేబీ టీం తో గతంలోనే విశ్వక్సేన్ కి కొన్ని గొడవలు ఉన్నాయి. అప్పట్లో తన సినిమా కథను విశ్వక్సేన్ కనీసం వినకుండా నో చెప్పాడని బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ చెప్పారు. ఆ తర్వాత బేబీ డైరెక్టర్ ను ఉద్దేశిస్తూ విశ్వక్ ఇన్ డైరెక్ట్ ట్వీట్ వేశాడు. ఓ సినిమాకు నో అంటే నో అని .. కూల్ గా ఉండాలని, అరిచి గోల చేయొద్దని అందులో రాసుకోచ్చాడు. తనకు ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ ఉన్నప్పుడు కథ వినకుండానే నో చెప్పానని, అనవసరంగా కథ విన్నాక నో చెప్పి డైరెక్టర్ టైం వేస్ట్ చేయడం తనకు ఇష్టం లేదని విశ్వక్సేన్ చెప్పుకొచ్చారు. అంతలోనే కల్ట్ అంటూ టైటిల్ ప్రకటించడంతో మరో వివాదం మొదలైంది. మరోవైపు నిర్మాత ఎస్కేఎన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ముందుగానే తమ సినిమా టైటిల్ రిజిస్టర్ చేయించాను కాబట్టి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆలోచించాలని చెప్పుకొచ్చారు. మరి ఈ కాంట్రవర్సీ ఎటు వైపుకు వెళుతుందో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది