waltair veerayya behind the story
Waltair Veerayya : వాల్తేరు వీరయ్య Waltair Veerayya.. సంక్రాంతి పండక్కి వస్తున్న మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi కొత్త సినిమా. చిరంజీవి రెండో ఇన్నింగ్స్‌లో బెస్ట్ టైటిల్‌తో వచ్చిన సినిమాగా దీన్ని చెప్పొచ్చు. చాలా క్యాచీగా ఉండే టైటిల్ పెట్టాడు చిరు అభిమాని అయిన దర్శకుడు కేఎస్ రవీంద్ర బాబీ. మాస్‌లోకి ఈ టైటిల్ చాలా ఈజీగా వెళ్లిపోయింది. సినిమాకు పెద్ద ఆకర్షణగా నిలిచింది అనే చెప్పాలి. సినిమా మొత్తం వైజాగ్ లో నడుస్తుంది. అక్కడ జాలరి పేటలో నివసించే వీరయ్య అంటే ఆ ప్రాంతం మొత్తానికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. వీరయ్య చెప్పిన మాటని అందరూ పాటిస్తూ ఉంటారు. వీరయ్యకి, అనే స్నేహితుడు ఉంటాడు. వీరయ్యకి తెలియకుండానే ఆ ప్రాంతంలో కొన్ని చట్ట వ్యతిరేకమైన పనులు జరుగుతూ ఉంటాయి. అవి ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
అయితే ఈ సినిమా లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే.. 90 దశకంలో చిరంజీవి ఎలాంటి మాస్ చిత్రాలు చేశారో.. ఆ వైబ్స్ వాల్తేరు వీరయ్యలో కనిపిస్తుంది. మాస్, కామెడీ, యాక్షన్ మిక్స్ చేసిన చిత్రం మెగాస్టార్ స్ట్రాంగ్ జోన్ అనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య ట్రైలర్ చూస్తే చిరంజీవి నుంచి ఫ్యాన్స్ ఏమేమి ఆశించవచ్చో అన్నీ ఉన్నాయి.ఇంతకముందు ఖైదీ నెంబర్ 150, రీసెంట్ గా గాడ్ ఫాదర్ అనే రీమేక్ చిత్రాల్లో నటించారు. దీనితో చిరు ఎక్కువగా రీమేక్ కథలు ఎందుకుంటున్నారు అనే విమర్శ ఉంది. వాల్తేరు వీరయ్య రిమేక్ కాదు. ఒరిజినల్ స్టోరీ. దర్శకుడు బాబీ ప్రాణం పెట్టి ఈ చిత్రాన్ని తీసారు.
waltair veerayya behind the story
చిరంజీవి.. రవితేజ కాంబినేషన్ అంటే అంచనాలు భారీగా ఉంటాయి.. మాస్ మహారాజ్ రవితేజ ఈ చిత్రంలో 40 నిమిషాల నిడివి ఉండే గెస్ట్ రోల్ ప్లే చేయడంతో సినిమా పీక్స్ కి వెళ్లింది. 2000 లో విడుదలైన అన్నయ్య తర్వాత చిరు, రవితేజ కలసి నటించారు. గత ఏడాది కొరటాల దర్శకత్వంలో చిరు నటించిన ఆచార్య చిత్రం ఎంతటి పరాజయం మూటకట్టుకుందో అందరికి తెలిసిందే. ఆ ప్రభావం ఇంకా మెగా ఫ్యాన్స్ ని వెంటాడుతూ ఉండగా,ఎట్టకేలకు ఈ సినిమాతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచారు.
Mallapur : ఉప్పల్ Uppal మండలం, మల్లాపూర్ డివిజన్ సూర్యానగర్ ప్రభుత్వ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో Mallapur BabaNagar…
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ఈ బ్యూటీ…
Sampurna Web Series : ప్రతి శుక్రవారం ఓటీటీలో OTT విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు Web Series ప్రేక్షకులను…
Smuggling : స్మగ్లింగ్ అంటే కొన్ని సినిమాలు మనకు గుర్తుకు వస్తాయి. వాటిలో ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’…
Rajitha Parameshwar Reddy : బోనాలు Bonalu చేసే ప్రతి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నట్లుగా ఉప్పల్ కార్పొరేటర్…
TDP : నెల్లూరు జిల్లా Nellore విడవలూరులో రాజకీయ ఆవేదన చుట్టుముట్టిన విషాద ఘటన చోటు చేసుకుంది. TDP టీడీపీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన Janasena అధినేత పవన్ కళ్యాణ్ హిందీ భాషకు Hindi…
Actor : చిన్నప్పటినుంచి వెండితెరపై మెరిసిన వ్యక్తి ఇప్పుడు హీరోగా తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా…
This website uses cookies.