Bandla Ganesh : బండ్ల గణేష్ తో షకలక శంకర్ గొడవ – స్టేజీ మీదే చొక్కా చొక్కా పట్టుకున్నారు ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bandla Ganesh : బండ్ల గణేష్ తో షకలక శంకర్ గొడవ – స్టేజీ మీదే చొక్కా చొక్కా పట్టుకున్నారు ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :2 January 2023,5:40 pm

Bandla Ganesh : మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చిన బండ్ల గణేష్ ప్రస్తుతం ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగి మంచి మంచి సినిమాలను చేస్తూ మంచి లాభాలను అందుకుంటున్నాడు. అయితే చాలామంది బండ్ల గణేష్ కు కొంచెం నోటి దురద ఎక్కువ అని అంటుంటారు. ఎందుకంటే ఎప్పుడు కాంట్రవర్షల్ కామెంట్స్ చేస్తూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంటాడు. అంతకుముందు పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఇప్పుడు రవితేజ లాంటి స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన

మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.ఇటీవల రవితేజ ‘ ధమాకా ‘ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న బండ్ల గణేష్ రవితేజను ఓ రేంజ్ లో పొగిడారు. రవితేజ స్వయంకృషితో పైకి వచ్చాడనీ, ఒకటి రెండేళ్లు కష్టపడి కొందరు అదృష్టంతో మెగాస్టార్, సూపర్ స్టార్స్ అయిపోతారు. రవి తేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి, ఆ తర్వాత ప్రొడక్షన్ బాయ్ గా చేసి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు అని అన్నారు. దీంతో మెగాస్టార్, సూపర్ స్టార్ అభిమానులు హర్ట్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో బండ్ల గణేష్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

war between Bandla Ganesh and Shakalaka Shankar

war between Bandla Ganesh and Shakalaka Shankar

అయితే జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ కి పరోక్షంగా రియాక్ట్ అయ్యాడు. షకలక శంకర్ మాట్లాడుతూ మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడాలి. మెగాస్టార్, సూపర్ స్టార్స్ అదృష్టం కొద్ది అవ్వరు, అన్నం నీళ్లు లేక నిద్ర లేక రాత్రింబవళ్లు కష్టపడితే, ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తే ఆ స్థాయికి వస్తారు, ఈ మాటలు ఎవరికీ తగలాలో వారికి తగులుతాయి అని పరోక్షంగా బండ్ల గణేష్ ని అన్నాడు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి