Silk Smitha : ఇన్ని దశాబ్దాల తరవాత బయటపడిన దారుణ నిజం .. సిల్క్ స్మిత చావు అప్పుడు ఆ హీరో ఏం చేసాడంటే !

Authored By Breaking News | The Telugu News | Published on: April 26, 2023, 7:00 pm

Silk Smitha : హీరోయిన్ సిల్క్ స్మిత అందరికీ సుపరిచితురాలే. 1980, 90 దశకాలలో దక్షిణాది చలనచిత్ర రంగాన్ని ఒక ఊపు ఊపింది. స్టార్ హీరోల సినిమాలకు దీటుగా సిల్క్ స్మిత సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. సినిమాలో సిల్క్ స్మిత ఉందంటే చాలు ఎగబడి మరి సినిమా చూసేవాళ్ళు. అప్పట్లో ఆమెకు అంత డిమాండ్ ఉండేది. ఆమె అందంతో పాటు ఆకర్షించే ఆమె వాయిస్ అప్పటి స్టార్ హీరోయిన్స్ కి కూడా అంతటి క్రేజ్ ఉండేది కాదు. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా చేయడం జరిగింది. కొన్ని దశాబ్దాలు పాటు ఓ వెలుగు వెలిగిన సిల్క్ స్మిత…

What did that hero do when Silk Smitha died

What did that hero do when Silk Smitha died

1996లో బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మరణించడం చాలామందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయటం జరిగింది. అయితే సినిమాలో ఆమె వేసే వేషాలకు… కాసులు కురిసే పరిస్థితులు ఉన్నాగాని బయట మాత్రం ఆమెకు విలువ ఉండేది కాదు. దీంతో ఆమె మరణించిన సమయంలో ఇండస్ట్రీలో పెద్దగా ఎవరు వెళ్లలేదట. దక్షిణాది సినిమా రంగంలో చాలా మంది టాప్ హీరోలు సరసన సిల్క్ స్మిత నటించింది. అయితే ఆమె మరణించిన సమయంలో ఆమె పార్థివ దేహాన్ని చూడటానికి ఒకే ఒక్క హీరో వెళ్లడం జరిగింది. ఆ హీరో మరెవరో కాదు యాక్షన్ హీరో అర్జున్.

Silk Smitha : తాను చ‌నిపోతాన‌ని ఆ హీరోకు ముందే చెప్పిన సిల్క్ స్మిత..  అత‌నికే ఎందుకు చెప్పింది..? - Latest News Telugu

సిల్క్ స్మిత అంత్యక్రియలకు అర్జున్ ఒక్కడే వెళ్లడంతో అప్పట్లో ఆయనపై రకరకాల వార్తలు కూడా రావడం జరిగింది. అయితే ఇండస్ట్రీలో అర్జున్ ఆమెకు మంచి స్నేహితుడు. బతికున్న సమయంలో నేను చచ్చిపోతే నన్ను చూడటానికి వస్తావా అర్జున్ అని ఒకసారి… బాధపడుతున్న సమయంలో తనకు అండగా ఉన్న టైములో అడిగిందట. దీంతో అది గుర్తుకొచ్చి సిల్క్ స్మిత చనిపోయిన తర్వాత.. అర్జున్ చివరి చూపుకు వెళ్లడం జరిగిందట. సిల్క్ స్మిత బయోపిక్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో డర్టీ పిక్చర్ అనే టైటిల్ తో వచ్చింది. విద్యాబాలన్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp