Bigg Boss Faima : ఫైమా ఎలిమినేట్ అయిన తర్వాత ప్రవీణ్ కలవడం లేదు.. అసలు ఏం జరిగింది

 Authored By prabhas | The Telugu News | Updated on :6 December 2022,1:00 pm

Bigg Boss Faima : జబర్దస్త్ కార్యక్రమం నుండి ఫైమా ఎలిమినేట్ అయిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పైమా హౌస్ లో ఉన్న సమయం లో జబర్దస్త్ ప్రవీణ్ ఏ స్థాయిలో ఆమెను ప్రమోట్ చేశాడే అందరికీ తెలిసిందే. ఫైమా కి ఓట్లు వేయండి అంటూ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ తన వీడియోల ద్వారా ఆమెను ప్రమోట్ చేశాడు. అలాంటి ఫైమా ప్రియుడు ప్రవీణ్ ఆమె ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కలవలేదట. ఇద్దరి మధ్య ప్రేమ ఉందని పెళ్లి చేసుకుంటారని ఇప్పటికే కుటుంబ పెద్దలు ఒప్పుకున్నారు అంటూ ప్రచారం జరిగింది.

ప్రవీణ్ కూడా పలు సందర్భాల్లో తాను ఫైమా ని పెళ్లి చేసుకుంటాను అంటూ పేర్కొన్నాడు. కానీ ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు కలవలేదు అనేది చర్చనీయాంశంగా మారింది. జబర్దస్త్ లో చేస్తున్న కెవ్వు కార్తీక్ కూడా ఫైమా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కలిసి అభినందించాడు. అంతే కాకుండా ఆమెకు ఘన స్వాగతం పలికాడు, కానీ ప్రవీణ్ మాత్రం ఏ వీడియోలో కూడా కనిపించలేదు. అసలు ఆ రోజు ఆమెను కలిసిన దాఖలాలు కూడా లేవు. ఎందుకు ప్రవీణ్ దూరంగా ఉంటున్నాడు అనేది పెద్ద క్వశ్చన్‌ మార్క్ గా ఉంది.

what happen between Bigg Boss Faima and praveen

what happen between Bigg Boss Faima and praveen

ఇద్దరి మధ్య హౌస్ లోకి వెళ్లే సమయం లోనే మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ ప్రవీణ్ ఇప్పుడు ఎందుకు రాలేదు అంటూ ఆమె హౌస్ లో ఉన్న సమయంలో ఏదో జరిగింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ లో ప్రవీణ్ కొనసాగుతున్నాడు ఫైమా స్టార్ మా కి వెళ్ళి పోయింది. కనుక ఇద్దరి మధ్య ప్రేమ బ్రేకప్ అయినట్లే అంటూ కొందరు మాట్లాడుకుంటుంటే.. మరికొందరు మాత్రం త్వరలోనే మళ్లీ కలుస్తారు అని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరు మళ్ళీ కలవాలని మనము ఆశిద్దాం.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి