Bigg Boss Faima : ఇదేంటి బిగ్‌ బాస్‌.. అక్కడ ఉండాల్సిన ఫైమా ఇక్కడ.. ఇక్కడ ఉండాల్సిన వారు అక్కడ

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 7, 2022, 7:00 pm

Bigg Boss Faima : బిగ్ బాస్ సీజన్‌ 6 తెలుగు నుండి మొన్న ఆదివారం ఫైమా ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే. ఫైమా ఎలిమినేషన్ ను చాలా మంది తప్పుబడుతున్నారు. ఆమెకు ప్రేక్షకుల మద్దతు ఉన్నా కూడా షో నిర్వాహకులు కావాలని ఎలిమినేట్‌ చేశారు అంటూ విమర్శలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఫైమా కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కచ్చితంగా టాప్ 5 వరకు ఉండాల్సిన కంటెస్టెంట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా కూడా ఆమె ఎందుకు ఎలిమినేట్‌ అయ్యింది అనేది పెద్ద ప్రశ్న.

సరే ఫైమా వీక్ అవ్వడం వల్ల ఎలిమినేట్‌ అయ్యిందే అనుకుందాం.. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో సగానికి పైగా ఫైమా కంటే వీక్ ఉన్న వారే ఉన్నారు. టాస్క్ ల్లో పెద్దగా ప్రభావం చూపించలేని వారు మరియు ఇమేజ్ పరంగా కూడా ఫైమా కంటే వెనుక ఉన్న వారు చాలా మందే ఉన్నారు. అయినా కూడా వారు లోపల ఉన్నారు.. ఫైమా బయట ఉంది అంటూ ఆమె అభిమానులు బిగ్‌ బాస్ టీమ్‌ పై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఫైమా గత వారంలోనే తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అవ్వాల్సింది సేవ్‌ అయ్యింది అంటూ బిగ్‌ బాస్ వారు పేర్కొన్నారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కిన కారణంగానే ఫైమా సేవ్‌ అయ్యింది.

Bigg Boss Faima elimination fans angry on Bigg Boss team and star maa tv

Bigg Boss Faima elimination fans angry on Bigg Boss team and star maa tv

కనుక ఈ వారం ఆమెను ఎలిమినేట్‌ చేయాల్సిందే అంటూ నిర్వాహకులు భావించారా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి టాప్‌ 5 కి కచ్చితంగా అర్హత ఉన్న కంటెస్టెంట్‌ ఫైమా. అయినా కూడా ఆమెకు ఛాన్స్ దక్కలేదు అంటూ బిగ్‌ బాస్ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. జబర్దస్త్‌ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుని చిన్న వయసులోనే ఎక్కువ క్రేజ్ ను దక్కించుకున్న ఫైమా కు బిగ్‌ బాస్‌ వారు అన్యాయం చేశారు అనేది ఆమె అభిమానుల మాట. ఫైమా కూడా తాను ఎందుకు ఎలిమినేట్‌ అయ్యానో తెలియడం లేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp