Bigg Boss Faima : ఫైమా అప్పుడు ఇప్పుడు ఎంత తేడా… పాపం చాలా పోగొట్టుకుంది
Bigg Boss Faima : ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ కార్యక్రమంతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఫైమా జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ లో దాదాపు అన్ని స్కిట్స్ లో సూపర్ హిట్ అనిపించుకుంటూ దూసుకు పోతున్న ఈ అమ్మాయి అనూహ్యంగా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది. స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ లో ఈమె ఎంటర్టైన్మెంట్ ని ఆకాశమే హద్దు అన్నట్లుగా అందిస్తుంది అంటూ అంతా నమ్మకం పెట్టుకున్నారు. కానీ బిగ్ బాస్ లో ఈ అమ్మాయి ఎంటర్టైన్మెంట్ పెద్దగా ఏమీ లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అప్పుడప్పుడు నాగార్జున కనిపించే ఎపిసోడ్స్ లో ఈమె కాస్త హడావుడి చేస్తుంది.
అంతే తప్పితే ఇతర ఎపిసోడ్స్ లో ఆమె పెద్దగా కామెడీ పండించే ప్రయత్నం చేయడం లేదని స్వయంగా ఆమె అభిమానులు అంటున్నారు. జబర్దస్త్ లో ఆమె వచ్చే సమయంలో చాలా ఎంజాయ్ చేసే వాళ్ళమని, కానీ ఇప్పుడు బిగ్బాస్ లో ఆమె కనిపిస్తూ పెద్దగా ఆకట్టుకోలేక పోతుంది అంటూ అభిమానులు నిరాశతో ఉన్నారు. ఇప్పటికే చాలా వారాలు పూర్తి అయ్యాయి. అయినా కూడా ఇప్పటి వరకు ఆమె నుండి ఎలాంటి పూర్తిస్థాయి కామెడీని చూడలేక పోయాం. కనుక ముందు ముందు కూడా ఆమె బిగ్ బాస్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసే పర్ఫామెన్స్ ఇస్తుందని మాకు నమ్మకం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ లో ఉన్న సమయంలో ఏ స్థాయిలో ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.

Bigg Boss Faima her fans unhappy with her comedy
ఇప్పుడు అందులో సగం కూడా ఆమె మెప్పించలేక పోతుందని.. బుల్లెట్ భాస్కర్ టీం లో ఉన్న సమయంలో ఫైమా లో ఫైర్ లో ఉండేదని.. అద్బుతమైన కామెడీ అందించేది. కానీ ఇప్పుడు బిగ్బాస్ లో ఉన్న ఒత్తిడి కారణంగా ఆమె లోని కామెడీ యాంగిల్ పూర్తిగా దెబ్బతింది అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఈమె జబర్దస్త్ లో కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది సాధ్యం కాకపోవచ్చు. స్టార్ మా లో ప్రసారమయ్యే కార్యక్రమాలు మాత్రమే ఆమె కనిపించాల్సి ఉంటుంది. కనుక బిగ్ బాస్ కి వెళ్లి ఫైమా మంచి ఛాన్స్ పోగొట్టుకున్నట్టు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయమై ఫైమా ఎలా స్పందిస్తుందో చూడాలి.