Jr NTR : బింబిసార విజయంలో ఎన్టీఆర్‌ వాటా ఎంత? ఎన్ని కోట్ల లాభం? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : బింబిసార విజయంలో ఎన్టీఆర్‌ వాటా ఎంత? ఎన్ని కోట్ల లాభం?

 Authored By aruna | The Telugu News | Updated on :9 August 2022,12:20 pm

Jr NTR : నందమూరి కళ్యాణ్ రామ్‌ – Kalyan Ram హీరోగా నటించిన బింబిసార సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ను 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించినా కూడా కేవలం 13 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్మాల్సి వచ్చింది. సినిమా ను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క బయ్యర్‌ కూడా ముందుకు రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆ మొత్తంకు అమ్మేయాల్సి వచ్చింది. ఇప్పుడు సినిమా కేవలం మూడు రోజుల్లోనే ఆ మొత్తంను రాబట్టి లాభాల బాట పట్టింది.

సినిమాకు వచ్చిన బజ్‌ నేపథ్యంలో భారీ ఎత్తున ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాకు పాజిటివ్ టాక్ దక్కిన కారణంగా లాంగ్‌ రన్‌ లో కూడా ఈ సినిమా భారీగా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో బింబిసార సినిమా ఈ ఏడాదిలోనే మేటి సినిమాల జాబితాలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో వైపు బింబిసార సినిమా యొక్క లాభాల వాటా గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్‌ లో ఎన్టీఆర్‌ కి వాటా ఉంది అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ లో వాటా ఉన్న కారణంగానే తన ప్రతి సినిమాలో కూడా ఆ బ్యానర్‌ ను నిర్మాణ భాగస్వామిగా ఎన్టీఆర్‌ చేస్తున్నాడని సమాచారం అందుతోంది.

What is Jr NTR share in Bimbisara success How many crores profit taking

What is Jr NTR share in Bimbisara success How many crores profit taking

ఎన్టీఆర్‌ ఆర్ట్స్ లో ఉన్న వాటా కారణంగానే ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమంలో తనవంతు పాల్గొన్నాడు. అందుకే ఇప్పుడు బింబిసార సినిమా లాభాల్లో కచ్చితంగా ఎన్టీఆర్‌ కి వాటా ఉండి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సినీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము అంతా ఒక కుటుంబం. మా మధ్య లెక్కలు ఉండవు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. మరి ఎన్టీఆర్‌ కి కళ్యాణ్‌ రామ్‌ బింబిసార లాభాల్లో వాటా ఇస్తాడా… కచ్చితంగా 10 నుండి 15 కోట్ల వరకు కళ్యాణ్ రామ్‌ లాభం గా దక్కించుకుంటాడు. మరి అందులో ఎన్టీఆర్ కి ఎన్ని కోట్లు ఇస్తాడు అనేది నందమూరి ఫ్యాన్స్ లో మెదులుతున్న ప్రశ్నలు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది