SR NTR vs Mohanbabu : అప్పట్లో.. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలింది ముగ్గురు నలుగురు హీరోలు మాత్రమే. అందులో ముందు వరుసలో ఉంటారు సీనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, మోహన్ బాబు లాంటి వాళ్లు ఉన్నారు. ఇండస్ట్రీలో అందరు పెద్ద హీరోలు ఇతర హీరోలతో కలిసి మెలిసే ఉండేవారు. అయితే.. మోహన్ బాబు మాత్రం ఎప్పుడూ సభల్లో ఒక విషయం చెబుతుంటారు. ఈ ఇండస్ట్రీలో నాకు గురువు గారు అంటే దాసరి నారాయణ రావు అని.. అన్న గారు అంటే ఎన్టీఆర్ అని అంటారు.కాకపోతే.. అప్పట్లో ఎన్టీఆర్, మోహన్ బాబు మధ్య మనస్పర్థలు వచ్చాయట. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందట. ఈ విషయాన్ని చాలా సార్లు మోహన్ బాబు వేదికల మీద చెప్పినప్పటికీ.. అసలు వాళ్లిద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందో మాత్రం దానికి కారణం ఇప్పటి వరకు చెప్పలేదు.
అసలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరోసారి సీఎం పదవి నుంచి దిగి పోయి ప్రతిపక్షంలో ఉన్నసమయంలోనే మేజర్ చంద్రకాంత్ అనే సినిమాను తీశారు. ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది.ఈ సినిమాను లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. మోహన్ బాబే ఈ సినిమాకు నిర్మాత. రాఘవేంద్రరావు డైరెక్టర్. ఆ తర్వాత ఎన్టీఆర్ మరోసారి జరిగిన ఎన్నికల్లో సీఎం అయ్యారంటే దానికి ఒకరకంగా ఈ సినిమానే కారణం. అలాగే.. మోహన్ బాబుకు కూడా ఆ సినిమానే పెద్ద బ్రేక్ ఇచ్చింది.
ఎందుకంటే.. అప్పటి వరకు మోహన్ బాబు సినిమాలన్నీ ప్లాఫ్ అవుతూ వచ్చాయి. ఆర్థికంగానూ మోహన్ బాబు చాలా నష్టపోయాడు. అదే సమయంలో ఎన్టీఆర్ తో తీసిన మేజర్ చంద్రకాంత్ సూపర్ డూపర్ హిట్ అయింది. మోహన్ బాబుకు చాలా లాభాలు తెచ్చిపెట్టింది.ఆ సినిమా విడుదలయ్యాక.. కొన్ని రోజులకు ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు. దీంతో తనకు ఖర్చులు పెరిగగాయని.. దీంతో ఇప్పుడు తాను మేజర్ చంద్రకాంత్ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకుంటానని మోహన్ బాబుకు ఎన్టీఆర్ చెప్పారట.
దీంతో సరే.. అని మోహన్ బాబు ఖాళీ చెక్కును తీసుకెళ్లి ఎన్టీఆర్ కు ఇచ్చారట మోహన్ బాబు. అయితే.. 25 లక్షలు ముందు ఇస్తానంటే సినిమా హిట్ అయ్యాకే ఇవ్వు.. ఇప్పుడు వద్దు అని అన్న సీనియర్ ఎన్టీఆర్.. ఖాళీ చెక్కు మీద 50 లక్షలు రాసుకున్నారట.ఆ విషయంలోనే ఇద్దరి మధ్య చెడిందట. తనకు లాభాలు తెచ్చిపెట్టినా.. ఎన్టీఆర్ 25 లక్షలు రాసుకుంటారేమోనని మోహన్ బాబు అనుకున్నారట. కానీ.. ఎన్టీఆర్ 50 లక్షల వరకు చెక్ మీద రాసుకొని తీసుకునేసరికి.. మోహన్ బాబు హర్ట్ అయినట్టు తెలుస్తోంది. అందుకే.. అప్పటి నుంచి మోహన్ బాబు, సీనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఎప్పుడూ ఎన్టీఆర్ తో మోహన్ బాబు మాట్లాడలేదట.ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపినప్పుడు కూడా మోహన్ బాబు ఎన్టీఆర్ ను కలవలేదట. చివరకు ఎన్టీఆర్ చనిపోయాక మాత్రం ఆయన్ను చూడటానికి మోహన్ బాబు వెళ్లారట.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.