Mahanati Savitri : సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఆమె పోషించిన పాత్రలు తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేశాయి. అంతే కాదు హీరోల కన్నా కూడా ఆమె ఇంటి ముందు దర్శకుల క్యూ ఎక్కువగా ఉండేది. ఆమె అవకాశం కోసం ఎంతోమంది ఎదురు చూసేవారంటే ఆమె క్రేజ్ ఎంతలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోలకు కూడా సావిత్రి డేట్స్ అడ్జస్ట్ కాకపోతే అప్పటివరకు ఎదరు చూసేవారంట. ఓ సందర్భంలో ఎన్టీ రామారావు సావిత్రి గురించి మాట్లాడుతూ ఆమెతో నటించడం గొప్ప అనుభవం అంటూ.. అలాగే ఆమెతో నటిస్తున్న సమయంలో భయపడిన సందర్భాలు కూడా తన జీవితంలో ఉన్నాయని చెప్పడం విశేషం. ఎస్వీ రంగారావు, శివాజీ గణేశన్ వంటి వారు కూడా సావిత్రి తో నటించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారట. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం అనే బిరుదు పొందింది.
అయితే ఎన్నో పాత్రలో జీవించిన సావిత్రికి ఎలాంటి అవార్డులు మాత్రం దక్కలేదనే చెప్పాలి. మహానటిగా పిలిపించుకున్న సావిత్రి 1965లో ఉత్తమ తెలుగు సినిమాగా ఫిలిం అవార్డు అందుకున్న చివరకు మిగిలేది అనే చిత్రంలో సావిత్రి నటించింది. తమిళ నటుడు జెమిని గణేశన్ ను పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో సంవత్సరం కోమాలో ఉన్న సావిత్రి 46 సంవత్సరాల వయసులో కన్నుమూసింది.
అయితే సావిత్రి కోమాలో ఉన్నప్పుడు చనిపోయే ముందు తన చివరి కోరిక తీర్చమని అడిగిందట. తాను చనిపోయాక తన సమాధిపై ఏమని రాయాలో చెప్పిందట. అదే… మరణంలోనూ, జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వతమైన విశ్రాంతిని పొందుతుంది. ఇక్కడికి ఎవరొచ్చినా కూడా సానుభూతితో తమ కన్నీళ్లని విడవనక్కర్లేదు. ఈ ఇండస్ట్రీలో కూడా ఎవరు హీనంగా చూడకుండా మరణంలేని ఆ సమాధిలో నిద్రిస్తున్న మహా ప్రతిభకు చిహ్నంగా ఒక పూమాలను ఉంచండి… ఇదే మీరు నాకు ఇచ్చే గౌరవం… అంటూ సావిత్రి చెప్పిందట. ఈ మాటలను ప్రముఖ సినీ విమర్శకుడు నందగోపాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
God Rings : నేటి ఆధునిక కాలంలో చాలామంది మెడలో వేసుకునే హారాలకు చైన్స్ కి నెక్లెస్ లకి మరియు…
Ind VS Sa : నేడు జొహానెస్‌బర్గ్ వేదికగా ఇండియా India వర్సెస్ సౌతాఫ్రికా South Africa ఆఖరి టీ…
Matka Movie Collections : మెగా హీరో వరుణ్ తేజ్ Varun Tej కరుణ కుమార్ కాంబోలో వచ్చిన సినిమా…
Diabetes : పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో మధుమేహం యొక్క అసాధారణ ప్రాబల్యం వరుసగా 45 నుంచి 60 శాతం…
Abhirami Suresh : నటి గాయని అయిన అభిరామి సురేష్ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల పట్ల ఆమె…
Nara Lokesh : వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా బాలకృష్ణ అన్ స్టాపబుల్…
KTR : ప్రజల కోసం వందసార్లు అరెస్టులకైనా, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు.…
This website uses cookies.