Home » Entertainment » What Surekha Vani Says About Second Marriage
Entertainment

Surekha vani : సురేఖా వాణి రెండో పెళ్ళి.. ఏం చెప్పిందో చూడండి..!

Authored By
vamana sai
The Telugu News | Published on: May 6, 2021, 10:40 am
Advertisement

Surekha vani : సురేఖా వాణి..దాదాపు హీరోయిన్ ఫేస్ అండ్ ఫిజిక్ ఉన్న నటి. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ గా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కొన్ని సినిమాలలో నటించేదేమో. కానీ అక్క, వదిన, అమ్మ పాత్రలకే పరిమితం అయింది. ఈ పాత్రలు చేసి కూడా సురేఖా వాణి టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇంతక ముందు టాలీవుడ్ లో తెరకెక్కే దాదాపు అన్నీ సినిమాలలో సురేఖా వాణి ఏదో పాత్రలో మెరిసేది. ఏ పాత్ర చేసిన సురేఖా వాణి ప్రేక్షకులను మెప్పించింది. అభిమానులు కూడా బాగానే సంపాదించుకుంది.

Advertisement

ఇక సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకున్న సురేఖా వాణి రెగ్యులర్‌గా తన లేటెస్ట్ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అందరు అభిమానులు ఒకేలా ఉండరు. మధ్యలో కొందరు ఆకతాయిలు తగులుతుంటారు. ఇలాంటి వాళ్ళే సెలబ్రిటీల పర్సనల్ విషయాలను తెలుసుకోవాలని..ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే సురేఖా వాణి రెండో పెళ్ళి మ్యాటర్ డిస్కర్షన్‌కి వచ్చిందట.

surekha vani says about second marriage

Advertisement

Surekha vani : సురేఖ వాణికి సినిమా అవకాశాలు పెద్దగా లేవా..?

ఈ మధ్య సోషల్ మీడియాలో తను రెండో పెళ్ళి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయని.. అయితే ఇదిలా వచ్చిందో తెలియలేదని అంటోంది. అంతేకాదు నాకు రెండో పెళ్ళి అయితే ఆ వ్యక్తి ఎవరో నాకు చెప్పాలని కోరింది. అంతేకాదు తనకి రెండో పెళ్ళి చేయాలనుకున్న వాళ్ళు కాస్త డబ్బున్న వాళ్ళని చూడమని తెలిపింది. మనసులు కలిసే ఛాన్స్ ఇప్పుడు లేదని అందుకే డబ్బున్న వాళ్ళు అయితే లైఫ్ హ్యాపీగా సాగుతుందని తన అభిప్రాయాన్ని వెల్లడించింది సురేఖా వాణి. ప్రస్తుతం సురేఖ వాణికి సినిమా అవకాశాలు పెద్దగా లేనప్పటికి సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది. ఇక తన కూతురును వెండితెరకి పరిచయం చేయాలనుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారమ జరుగుతోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి