Getup Srinu : గెటప్ శ్రీను అక్కడ కూడా కనిపించడం లేదేం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Getup Srinu : గెటప్ శ్రీను అక్కడ కూడా కనిపించడం లేదేం…?

Getup Srinu : జబర్దస్త్‌ నుండి బయటకు వచ్చిన వాళ్లు పక్క ఛానల్స్ లో స్టార్స్‌ గా వెలుగు వెలుగుతున్నారు. జబర్దస్త్‌ లో కాస్త అనుభవం ఉన్నా చాలు మేము కళ్లకు అద్దుకుని తీసుకుంటాం అంటూ కొందరు ఫిల్మ్‌ మేకర్స్ కూడా ముందుకు వస్తున్నారు. మొత్తానికి జబర్దస్త్‌ లో ఒక పది స్కిట్స్ లో కనిపించి జనాల్లో గుర్తింపు దక్కించుకుంటే చాలు సినిమాల్లో లేదా పక్క ఛానల్స్ లో మంచి గుర్తింపు వస్తుంది. పక్క ఛానల్స్ చేయడంతో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :8 June 2022,1:00 pm

Getup Srinu : జబర్దస్త్‌ నుండి బయటకు వచ్చిన వాళ్లు పక్క ఛానల్స్ లో స్టార్స్‌ గా వెలుగు వెలుగుతున్నారు. జబర్దస్త్‌ లో కాస్త అనుభవం ఉన్నా చాలు మేము కళ్లకు అద్దుకుని తీసుకుంటాం అంటూ కొందరు ఫిల్మ్‌ మేకర్స్ కూడా ముందుకు వస్తున్నారు. మొత్తానికి జబర్దస్త్‌ లో ఒక పది స్కిట్స్ లో కనిపించి జనాల్లో గుర్తింపు దక్కించుకుంటే చాలు సినిమాల్లో లేదా పక్క ఛానల్స్ లో మంచి గుర్తింపు వస్తుంది. పక్క ఛానల్స్ చేయడంతో పాటు హీరోలుగా సినిమాలు చేస్తున్న వారు ఉన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా చేస్తున్న వారు ఉన్నారు.

గెటప్ శ్రీను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన బుల్లి తెర కమల్‌ హాసన్‌ అంటూ పేరు దక్కించుకున్నాడు. అలాంటి గెటప్ శ్రీను కూడా జబర్దస్త్‌ నుండి బయటకు వచ్చేశాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడు అనే క్లారిటీ లేదు. మొన్నటి వరకు సినిమా లతో బిజీగా ఉండటం వల్ల జబర్దస్త్‌ లో కనిపించడం లేదు.. ఖచ్చితంగా గతంలో మాదిరిగా రెండు మూడు వారాల తర్వాత వస్తాడు అని అంతా అనుకున్నారు. కాని తాజాగా గెటప్‌ శ్రీను రాడు అని క్లారిటీ వచ్చేసింది. గెటప్ శ్రీను స్టార్‌ మా లో కనిపించడం లేదు..

where is jabardasth Getup Srinu

where is jabardasth Getup Srinu

మరే ఛానల్ లో కూడా కనిపించడం లేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఎక్కడ ఉన్నాడు అనేది అభిమానుల ప్రశ్న. ఆయన ప్రస్తుతం చేతిలో పది సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ను దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే టీవీ ల్లో ఇక మీదట ఈయన కనిపించక పోవచ్చు అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు. సినిమా ల్లో ఆఫర్లు రాకుంటే అప్పుడు టీవీ వైపు చూస్తాడేమో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది