Conductor Jhansi : పల్సర్ బండి ఝాన్సీకి మరో ఛాన్స్… ఈసారి రెమ్యూనరేషన్ వింటే షాక్
Conductor Jhansi : శ్రీదేవి డ్రామా కంపెనీ ( sridevi dram company )లో పల్సర్ బండి పాటకు డాన్స్ చేసిన లేడీ కండక్టర్ ఝాన్సీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతుంది. ఒకవైపు జబర్దస్త్ లో వరుసగా బుల్లెట్ భాస్కర్ టీం లో కనిపిస్తున్న ఝాన్సీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవ్వబోతుందంటూ ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది. ఇటీవలే ఝాన్సీ కి సంపూర్ణేష్ బాబు ఆఫర్ ఇచ్చాడంటూ ప్రచారం జరిగింది. ఆయన తన సినిమాలో ఐటమ్ సాంగ్ ని ఝాన్సీతో చేయించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే సమయంలో ఝాన్సీ కి మరో ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. టాలీవుడ్ కి చెందిన ఒక యంగ్ హీరో సినిమాలో ఫుల్ లెన్త్ పాత్రలో ఆమెకు అవకాశం దక్కిందట.. అందుకుగాను ఆమె 40 రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉందట.
నిర్మాతలు ఆమెకు 20 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడంతో పాటు ఐదు నుండి ఆరు లక్షల రూపాయల అదనపు చార్జీలు ఇవ్వనున్నారట. మొత్తంగా ఆ సినిమాతో దాదాపుగా పాతిక లక్షల రూపాయలను కండక్టర్ ఝాన్సీ దక్కించుకోబోతుంది అంటున్నారు. యంగ్ హీరో సినిమాలో ఝాన్సీ నటించబోతుందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఇప్పటికి కూడా జబర్దస్త్ లో కంటిన్యూ అవుతుంది, అంతేకాకుండా స్టేజి షో లతో కూడా ఆకట్టుకుంటుంది. మరో వైపు కండక్టర్గా కూడా ఉద్యోగాన్ని నిర్వహిస్తుంది. ఇలా బిజీ బిజీగా ఉన్నా కండక్టర్ ఝాన్సీ కి సినిమాల్లో తాజాగా దక్కిన ఆఫర్ ఒక గొప్ప అవకాశం గా చెప్పుకోవచ్చు.

sridevi dram company jhansi get one more movie chance in tollywood
ఆ సినిమా సక్సెస్ అయితే వెను తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తాయని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నటిగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా ఇవ్వగల ఝాన్సీని ప్రేక్షకులు తప్పకుండా వెండి తెరపై చూసి అభిమానిస్తారు.. అభినందిస్తారు అంటూ ఆమె సన్నిహితులు నమ్మకంతో ఉన్నారు. సినిమాల్లో ఆఫర్స్ వచ్చినా కూడా ఈటీవీలో కార్యక్రమాలను వదిలి పెట్టేది లేదు అంటూ ఇటీవల సన్నిహితుల వద్ద కండక్టర్ ఝాన్సీ చెప్పుకొచ్చిందట. ప్రస్తుతానికి కండక్టర్ జాబ్ కి లాంగ్ లీవ్ లో ఉన్న ఝాన్సీ త్వరలోనే ఆ జాబ్ కి రిజైన్ చేసిన ఆశ్చర్యం లేదు. కండక్టర్ ఝాన్సీ కాస్త నటి ఝాన్సీగా అతి త్వరలోనే రూపాంతరం చెంది అవకాశాలు కనిపిస్తున్నాయి.