who is correct pallavi prashanth and amardeep in bigg boss telugu 7
Bigg Boss 7 Telugu : పల్లవి ప్రశాంత్.. ఒక రైతు బిడ్డ. అవును.. రైతు బిడ్డగానే హౌస్ లో అడుగు పెట్టాడు. రైతు బిడ్డ అని చెప్పుకునే బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టాడు. అయితే ఏంటి.. సమస్య ఏంటి.. ఒక రైతు బిడ్డగా హౌస్ లో అడుగుపెట్టడం తప్పు కాదు కదా. కానీ.. రైతు బిడ్డ అనే ఒక సింపతీ కార్డు వాడుకొని ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడని ఇంటి సభ్యులు అందరూ తెగ హడావుడి చేశారు. రెండో వారం నామినేషన్ల విషయంలో వాళ్లంతా చేసిన హడావుడి మామూలుగా లేదు. ముఖ్యంగా అమర్ దీప్, ప్రశాంత్ మధ్య నామినేషన్ల సమయంలో పెద్ద గొడవే జరిగింది.ఇద్దరూ తీవ్రస్థాయిలో దూషించుకున్నారు. ప్రశాంత్ ను ఎక్కువ మంది నామినేట్ చేయడం, ఆయన రైతు బిడ్డ అనే సింపతీ కార్డును వాడుకొని వచ్చాడంటూ, హౌస్ లో ఆటిట్యూట్ చూపిస్తున్నాడంటూ రచ్చ రచ్చ చేశారు.
రైతు బిడ్డ అంటున్నావు.. రైతులు మాత్రమే కాదు కదా.. ఈరోజుల్లో చాలామంది బీటెక్ చదివిన వారు ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఏంటి.. బయటికి వచ్చి వాళ్లు ఎన్ని కష్టాలు పడతారు అన్నట్టుగా అమర్ దీప్.. ప్రశాంత్ పై సీరియస్ అయ్యాడు. మరోవైపు ప్రశాంత్ కూడా ఆటిట్యూట్ చూపిస్తూ నువ్వేంటి నీ సీరియల్ కష్టాలు అంటూ సీరియల్ గురించి మాట్లాడటంతో రచ్చ రచ్చ అయింది.అమర్ దీప్, ప్రశాంత్ ఇద్దరి మధ్య చాలా గొడవ జరగడం పక్కన పెడితే చాలామంది ప్రశాంత్ ను టార్గెట్ చేసి మరీ నామినేట్ చేశారు. చాలామంది ప్రశాంత్ ని ఎందుకు టార్గెట్ చేశారు అంటే.. ప్రశాంత్ లో రెండు కోణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే రతిక కూడా ప్రశాంత్ ను నామినేట్ చేయడం అసలు ట్విస్ట్.
who is correct pallavi prashanth and amardeep in bigg boss telugu 7
ప్రశాంత్ ను రతిక నామినేట్ చేయడానికి ముఖ్య కారణం.. ఆయన అన్ని సీజన్లు చూసి వచ్చి ఇక్కడ బాగా నటిస్తున్నాడు. రైతు బిడ్డ అని చెప్పి ఇక్కడికి వచ్చాడు. బయట వీడియోలో ఎంతో వినయంగా ఉన్న ప్రశాంత్.. ఇక్కడికి వచ్చి మాత్రం ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటూ రతిక.. ప్రశాంత్ ని నామినేట్ చేసింది. అసలు నేను వాడిని ఎప్పుడు లవ్ చేశాను. వాడే చాలా ఎమోషనల్ గా తీసుకున్నాడు. ఏదో చేద్దాం అనుకున్నాడు. అవన్నీ కుదరవు అని డైరెక్ట్ గా చెప్పేశా అంటూ రతిక దామినితో చెప్పేసింది. అలాగే చాలామంది ఇతర కంటెస్టెంట్లు కూడా ప్రశాంత్ ను రతిక వెంట పడుతున్నాడనే నామినేట్ చేశారు. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు శివాజీ, ప్రశాంత్, రతిక, తేజ, అమర్ దీప్, షకీలా, గౌతమ్, శోభాశెట్టి, యావర్ నామినేట్ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.