Krithi Shetty : కృతి శెట్టి కెరీర్ నాశనం చేస్తోంది ఎవరు ?
Krithi Shetty : టాలీవుడ్ లో ‘ ఉప్పెన ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలు కృతి శెట్టికి అంతగా హిట్ ఇవ్వలేదు. వరుసగా డిజాస్టర్ లను ఎదుర్కుంటూ వస్తుంది. అయినా ఈ బ్యూటీకి వరుస సినీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా కృతి శెట్టి ‘ కస్టడీ ‘ సినిమాలో నటించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితం థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలై సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నాగచైతన్య నటించాడు. ఈ సినిమాలో వీరిద్దరి రొమాన్స్ హైలెట్ గా మారింది.
వీళ్ళ లవ్ స్టోరీ పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ క్రమంలో కృతి శెట్టి ఖాతాలో మరో హిట్ పడినట్లు అయింది. వరుసగా డిజాస్టర్ అందుకున్న కృతి శెట్టికి ఈ సినిమా ప్లస్ అయింది. ఈ క్రమంలోనే కృతి శెట్టికి సంబంధించిన న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు జనాలు. వరుసగా మూడు ఫ్లాపులు పడడంతో ఆఖరికి కృతి శెట్టి బికినీ వేసుకోవడానికి కూడా రెడీ అయింది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే కృతి శెట్టి కి బికినీ వేసుకోవడం అసలు ఇష్టం లేదట. తన పేరెంట్స్ కావాలనే బలవంతంగా ఆమె ద్వారా డబ్బులు సంపాదించడానికి ఇలాంటి సినిమాలు ఓకే చేశారని న్యూస్ వైరల్ అవుతుంది. మొదటి సినిమా నుంచి కృతి శెట్టి చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా కనిపిస్తూ వచ్చింది.
అయితే ఇటీవల కృతి శెట్టి ఫోటోషూట్స్ చాలా బోల్డ్ గా కనిపించాయి. దీనికి కారణం తెరవెనుక వాళ్ళ అమ్మ నడిపే కథే అంటూ తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కొన్నిసార్లు లిమిట్స్ దాటాలి అని అలాగే కృతిశెట్టి కూడా మీరింది అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు కృతి శెట్టి బికినీ వేసినందుకు ఏకంగా రెండు కోట్లు అదనంగా చెల్లించాలని వాళ్ళ అమ్మ డిమాండ్ చేసిందట. ఈ క్రమంలోనే కృతి శెట్టి ఇలా డిజాస్టర్ అవ్వడానికి కారణం వాళ్ళ పేరెంట్స్ అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీనిపై కృతి శెట్టి ఇంతవరకు స్పందించలేదు.