Ileana : ఇలియానా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలిసింది .. ఒక్క ఫోటోతో మొత్తం స్టోరీతో దొరికింది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ileana : ఇలియానా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలిసింది .. ఒక్క ఫోటోతో మొత్తం స్టోరీతో దొరికింది !

 Authored By kranthi | The Telugu News | Updated on :4 June 2023,12:00 pm

Ileana : ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒకప్పుడు టాలీవుడ్ లో తను ఒక సెన్సేషన్. ఇలియానా అంటే పడి చచ్చిపోయేవారు. చాలా ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కనుమరుగు అయింది. బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో తన లక్ పరీక్షించుకుంది కానీ.. అక్కడ కూడా తనకు అంతగా స్టార్ డమ్ రాలేదు. దీంతో తిరిగి టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తనను అందరూ టాలీవుడ్ బెల్లీ అంటారు. తన ఫిజిక్ మాత్రం సూపర్ గా ఉంటుంది.

who is the father of child of ileana

who is the father of child of ileana

తన ఫిజిక్ చూసి కుర్రాళ్లు అయితే తట్టుకోలేరు. ప్రస్తుతం తన చేతుల్లో ఎలాంటి సినిమా ఆఫర్స్ అయితే లేవు. కానీ.. తను మాత్రం పర్సనల్ లైఫ్ ను ఫుల్ టు ఎంజాయ్ చేస్తోంది. ఎందుకంటే తనకు పెళ్లే కాలేదు కానీ.. అప్పుడే ప్రెగ్నెంట్ అయింది. దీంతో తన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అదేంటి పెళ్లి కాకుండా గర్భం ఎలా వచ్చిందంటూ సోషల్ మీడియాలో తన గురించే చర్చల మీద చర్చలు. తను ప్రెగ్నెంట్ అని అయితే చెప్పింది కానీ.. తన బిడ్డకు తండ్రి ఎవరో మాత్రం చెప్పలేదు ఇలియానా.

Ileana : ఇంతకీ ఇలియానా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు?

దీంతో ఆమె గురించి సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే.. ఒక చిన్న క్లూ మాత్రం వదిలింది ఇలియానా. తన బేబీ బంప్ కి సంబంధించిన ఫోటోలను ఇటీవల షేర్ చేసింది ఇలియానా. అందులో ఓ వ్యక్తి చేతులు పట్టుకొని ఉంది. డైమండ్ రింగ్ కూడా పెట్టుకొని మేము ఎంగేజ్ డ్ అన్నట్టుగా చూపించింది. ఆ వ్యక్తి ఎవరో కాదు.. కత్రినా సోదరుడు సెబాస్టియన్. గతంలో వీళ్లిద్దరూ చాలా సార్లు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. మరి.. ఇప్పుడు ఇలియానా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కూడా అతడే అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. చూద్దాం మరి చివర్లో ఇలియానా ఎలాంటి బాంబు పేలుస్తుందో.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది