Mahesh Babu : మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల్లో తప్పు ఎవరిది.. ఎందుకు ఇలా జరుగుతోంది?

 Authored By prabhas | The Telugu News | Updated on :11 August 2022,8:30 am

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట విడుదల అయ్యి చాలా నెలలు అవుతోంది. అయినా కూడా ఇప్పటి వరకు మహేష్బాబు తదుపరి సినిమా ప్రారంభం కాలేదు. గతంలోనే మహేష్బాబు తదుపరి సినిమా ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అధికారిక ప్రకటన వచ్చే సంవత్సరం దాటిన కూడా ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో వచ్చే ఏడాది అయినా సినిమా విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ప్రారంభించి మెల్లగా షూటింగ్ జరిగినా పర్వాలేదు కానీ అసలు షూటింగ్ ప్రారంభించక పోవడంతో ఏ సమయంలోనైనా సినిమా క్యాన్సిల్ అయింది అంటూ ప్రచారం జరిగే అవకాశం ఉందని అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబినేషన్ కోసం దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నాం. ఇప్పటికి కూడా సినిమా ప్రారంభించక పోవడంతో అసంతృప్తిగా ఉంది అంటూ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

who is the responsibility for late of Mahesh Babu and Trivikarm Movie late

who is the responsibility for late of Mahesh Babu and Trivikarm Movie late

సోషల్ మీడియాలో ఈ సినిమా ఆలస్యం కు కారణం ఎవరు అంటూ ప్రచారం జరుగుతోంది మహేష్ బాబు డేట్లు ఇవ్వక పోవడం వలన సినిమా ఆలస్యం అవుతుందా.. లేదంటే త్రివిక్రమ్ ఇంకా స్క్రిప్ట్ పూర్తి చేయక పోవడం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతుందా అంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది వారిద్దరిలో ఎవరో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలిసే అవకాశం లేదు. ఈ సినిమా తర్వాత మహేష్‌ బాబు జక్కన్న సినిమా లో నటించాల్సి ఉంది. కనుక ఈ సినిమా త్వరగా పూర్తి అయితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి