Pongal Winner : సంక్రాంతి బ‌రిలో నిలిచిన మూడు సినిమాలు.. ముగ్గురిలో విన్న‌ర్ ఎవ‌రో తెలిపోయిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pongal Winner : సంక్రాంతి బ‌రిలో నిలిచిన మూడు సినిమాలు.. ముగ్గురిలో విన్న‌ర్ ఎవ‌రో తెలిపోయిందిగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 January 2025,11:09 am

ప్రధానాంశాలు:

  •  Pongal Winner : సంక్రాంతి బ‌రిలో నిలిచిన మూడు సినిమాలు.. ముగ్గురిలో విన్న‌ర్ ఎవ‌రో తెలిపోయిందిగా..!

Pongal Winner : టాలీవుడ్‌లో సంక్రాంతి సంద‌డి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెద్ద హీరోల సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి వినోదం పంచుతూ ఉంటాయి. పెద్ద పండుగలు సంక్రాంతి, దసరా, దీపావళి వంటి రేస్ లో సినిమాలు వచ్చి హిట్ అయితే వాటి లాంగ్ రన్ చాలా గట్టిగా ఉంటుంది. ఇక ఈ అన్నిటిలో కూడా సంక్రాంతి బరిలో వచ్చి హిట్ టాక్ పడితే మాత్రం అది భారీ వసూళ్లు అందిస్తుంది అని నిర్మాత‌లు భావిస్తుంటారు. ఈ సారి తమిళ్ నుంచి ఎలాంటి సినిమాలు తెలుగులో లేకపోవడంతో ఈ సంక్రాంతి పూర్తిగా తెలుగుదనంతో నిండిపోయింది.

Pongal Winner సంక్రాంతి బ‌రిలో నిలిచిన మూడు సినిమాలు ముగ్గురిలో విన్న‌ర్ ఎవ‌రో తెలిపోయిందిగా

Pongal Winner : సంక్రాంతి బ‌రిలో నిలిచిన మూడు సినిమాలు.. ముగ్గురిలో విన్న‌ర్ ఎవ‌రో తెలిపోయిందిగా..!

Pongal Winner విన్న‌ర్ ఎవ‌రు.

ముందుగా రామ్ చ‌ర‌ణ్ హీరోగా వ‌చ్చిన గేమ్ ఛేంజ‌ర్ భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా చాలా దారుణంగా తయారైందనే విషయం అయితే తెలుస్తోంది. ఈ సినిమా కోసం దిల్ రాజు 400 కోట్ల బడ్జెట్ ను పెట్టినప్పటికీ ఈ బడ్జెట్ కూడా రికవరీ అవుతుందా లేదా అనే అనుమానాలు అంద‌రిలో మెదులుతున్నాయి. ఇక బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘డాకు మహారాజు’ సినిమా ఈనెల 12వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో బాలయ్య బాబు మరోసారి సంక్రాంతి విన్నర్ గా నిలిచారనే చెప్పాలి. ఇక వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’

ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని బేస్ చేసుకొని తీసిన ఈ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మ రథం పడుతున్నారనే చెప్పాలి. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఈ సంవత్సరంలో దక్కిన మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ గా తెలుస్తుంది…ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి మ‌రో సారి మంచి హిట్ అందించి ప్రేక్ష‌కుల‌కి అదిరిపోయే ఎంట‌ర్టైన్‌మెంట్ అందించాడు. మొత్తానికి ఈ సంక్రాంతి రామ్ చ‌ర‌ణ్‌కి పెద్ద ఎఫెక్ట్ ప‌డేలా చేసింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది