Sankranti Kites : పతంగులు ఎగరేస్తున్నారా.. అయితే ఏ ప‌తంగులు బెస్ట్ అనేది మీకు తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sankranti Kites : పతంగులు ఎగరేస్తున్నారా.. అయితే ఏ ప‌తంగులు బెస్ట్ అనేది మీకు తెలుసా?

 Authored By ramu | The Telugu News | Updated on :14 January 2025,5:23 pm

Sankranti Kites : సంక్రాంతి స‌మ‌యంలో వ‌చ్చే పండ‌గ ప‌తంగుల పండ‌గ‌. మకర సంక్రాంతిని పురస్కరించుకుని చిన్నా, పెద్దా కలిసి ఆకాశంలోకి పతంగులను ఎగురవేస్తారు. అయితే ఈ గాలిపటాన్ని ఎగురవేయాలంటే ఎలాంటి ప్రదేశాలు ఎంచుకోవాలి, ఏయే ప్రాంతాల్లో ఎగురవేయకూడదు అన్న విషయాలు చాలా మందిని గందరగోళానికి గురి చేస్తూ ఉంటాయి. గాలిపటం ఎగరడానికి స్థిరమైన గాలి ఉండాలి. బీచ్‌లు, పార్కులు, పొలాలు వంటి పుష్కలంగా ఉండే ఖాళీ ప్రదేశాలు గాలిపటాలను ఎగురవేసేందుకు ఉత్తమ ప్రదేశాలుగా చెప్పవచ్చు. చెట్లు, విద్యుత్ లైన్లు, విమానాశ్రయాల దగ్గర గాలిపటాలు ఎగురవేయకూడదు. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైనవి.

Sankranti Kites పతంగులు ఎగరేస్తున్నారా అయితే ఏ ప‌తంగులు బెస్ట్ అనేది మీకు తెలుసా

Sankranti Kites : పతంగులు ఎగరేస్తున్నారా.. అయితే ఏ ప‌తంగులు బెస్ట్ అనేది మీకు తెలుసా?

సాధారణంగా ఈ పండుగను సూర్య దేవతకు కృతజ్ఞత తెలపడం కోసం జరుపుకుంటారు. అయితే, కైట్స్ ఎగరడం ఈ పండుగకు మరొక ప్రత్యేకమైన ప్రతీకగా మారింది. రేడియో కంట్రోల్ రిసీవర్ ఉండ‌డం వ‌ల‌న అవి గాలిలో ప్రొపెల్లర్ ద్వారా ఎగురుతుంది. దీని నిర్మాణంలో గాలిపటం, లక్షణాలు ఉన్నాయి. ఈ గాలిపటం అద్భుతమైన ఆకాశ యాత్ర చేస్తుంది. ఇది తేలికపాటి గాలుల్లోనూ గ్లైడర్‌గా తేలుతూ మ‌నల్ని ఉత్సాహప‌రుస్తుంది., లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లా మొత్తం యాక్రోబాటిక్ మోషన్లను చేస్తుంది. దీనిని సులభంగా, సమర్థంగా నియంత్రించవచ్చు. అయితే గాలి ప‌టం ఎగర‌డానికి చెట్లు, కొండలు, భవనాలు లేదా పొదలు వంటి అడ్డంకులు లేకుండా పెద్ద, చదునైన ప్రాంతం కోసం చూడండి. అధికంగా వీచే గాలి.. అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. ఇది మీ గాలిపటం ఎగరడాన్ని కష్టతరం చేస్తుంది.

Sankranti Kites పతంగులు ఎగరేస్తున్నారా అయితే ఏ ప‌తంగులు బెస్ట్ అనేది మీకు తెలుసా

Sankranti Kites : పతంగులు ఎగరేస్తున్నారా.. అయితే ఏ ప‌తంగులు బెస్ట్ అనేది మీకు తెలుసా?

మీ గాలిపటం విద్యుత్ లైన్లలో చిక్కుకుపోతే, దాన్ని అక్కడే వదిలేయండి. వీలైతే ఆయా ప్రదేశాల్లో ఉన్న విద్యుత్ అధికారులను సంప్రదించండి. అంతేకానీ దాన్ని తీసుకునేందుకు రిస్క్ చేయకండి. దీని వల్ల ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. గాలిపటాలు ఎగురవేయడానికి ప్రత్యేక సమయంటూ లేకపోయినప్పటికీ మన దేశంలో మాత్రం సంక్రాంతి పండుగ సమయంలో ఎగురవేస్తారు. ఈ పండుగ చలికాలంలో వస్తుంది. ఈ కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ ల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. కావున పతంగులను బహిరంగ ప్రదేశాల్లో ఎగురవేయడం వల్ల మన శరీరంపై సూర్య కిరణాలు పడి, విటమిన్ డి అందుతుంది. దీని వల్ల చర్మ వ్యాధులు నయమవుతాయి. అంతే కాకుండా ఈ సీజన్ లో గాలి ఒకే దిశగా సాగడం వల్ల గాలిపటాలు ఎగరేయడానికి సులువుగా ఉంటుందని కూడా చెబుతారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది