Nagarjuna – Amala : అమలతో నాగార్జున పెండ్లికి ఏన్నార్ ఎందుకు ఒప్పుకోలేదంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna – Amala : అమలతో నాగార్జున పెండ్లికి ఏన్నార్ ఎందుకు ఒప్పుకోలేదంటే..?

 Authored By aruna | The Telugu News | Updated on :16 August 2022,12:40 pm

తెలుగు చిత్రసీమలో అగ్ర కుటుంబాల్లో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తెలుగు చిత్రసీమకు రెండు కళ్ళ లాంటి వారు. ఏఎన్నార్ కుటుంబానికి చిత్రసీమతో దాదాపు 60 ఏళ్ల అనుబంధం ఉంది. ఏఎన్ఆర్ నుంచి నేటితరం హీరో అఖిల్ వరకు చిత్ర సీమలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఏఎన్ఆర్ ఫ్యామిలీ మెంబర్స్.

Nagarjuna – Amala : నాగార్జునతో అమల పెళ్లికి ఏఎన్ఆర్ ఎందుకు సుముఖత చూపలేద

తెలుగు చిత్రసీమలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరావు. అయన తర్వాత వారసుడుగా ఆయన కుమారుడు నాగార్జున సినీ రంగంలోకి ప్రవేశించాడు. నాగార్జున సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా దిట్ట. ఎప్పుడు వ్యాపారం చేయాలి ఏ రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయో ఆయనకు తెలియనిది కాదు. సినిమాలు, బిజినెస్ లల్లో ఆరితేరిన నాగార్జున మొదటి పెళ్లి విషయంలో రాంగ్ స్టెప్ వేశాడని ఏఎన్ఆర్ అప్పట్లో నమ్మాడట. నాగార్జున మొదటి వివాహం డి.రామానాయుడు కుమార్తె శ్రీ లక్ష్మితో జరిగింది. నాగార్జున సినిమాల్లోకి రాకముందే శ్రీలక్ష్మి తో వివాహం జరిగింది. ఈ దంపతులకు నాగచైతన్య పుట్టాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చి శివ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమలను పెళ్లి చేసుకున్నాడు నాగార్జున. నాగార్జున అమల పెళ్లి చేసుకోవడం ఏఎన్నార్ కు ఏ మాత్రం ఇష్టం లేదట.

Why did anr not agree to Nagarjuna marriage with Amala

Why did anr not agree to Nagarjuna marriage with Amala?

ఈ రంగంలో ఉన్న వారి జీవితాలు వ్యక్తిగతంగా క్రమశిక్షణతో సాగవని ఆయన నమ్మేవాడట. ఏఎన్ఆర్ సినిమా రంగంలో ఉండటంతో ఆయనకు ఎవరు పిల్లని ఇచ్చేవారు కాదట. ఆయన సొంత మేనమామలు కూడా ఆయనకు పిల్లను ఇవ్వడానికి ముందుకు రాలేదట దీంతో ఆయనకు లేటు వయసులో పెళ్లి అయిందట. అందుకే అమలను తన ఇంటి కోడలిగా చేసుకోవడానికి నాగేశ్వరావు ఇష్టం లేదట. దీనికి తోడు ఆమె తెలుగు అమ్మాయి కాకపోవడంతో నాగార్జున అర్థం చేసుకుంటుందా లేదా అన్న సందేహం నాగేశ్వరరావు ఉండేదట. అయితే చివరకు నాగార్జున ఇష్టాన్ని కాదనలేక ఏఎన్ఆర్ నాగార్జున అమల పెళ్ళికి చివరకు ఒప్పుకున్నాడట. ఆ తర్వాత అమల అక్కినేని కుటుంబ వంశ గౌరవాన్ని కాపాడుకుంటూ కుటుంబంలో ఉన్న సభ్యురాలిగా మంచి స్థానాన్ని సంపాదించుకుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది