
Why did SR NTR keep his own brother away
SR NTR : నందమూరి తారకరామారావు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు గురించి తెలియని వారుండరు. వెండితెరపై చాలా కాలం ఓ వెలుగు వెలిగారు. తమిళనాడు నుంచి ఆంధ్రరాష్ట్రం విడిపోయాక సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌కు రావడంలోనూ ఆయన పాత్ర ఎనలేనిది. నాడు కాంగ్రెస్ హయాంలో ప్రజలు పడుతున్న బాధలను చూసి సొంతంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన కేవలం 9నెలలకే ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించారు. తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌ను కుటుంబంలో ఒక వ్యక్తిగా చూశారు.ఆయన మీదున్న అభిమానంతో అందరూ ఆయన్ను అన్నగారు అని సంబోధిస్తుంటారని అందరికీ తెలిసిందే. అయితే, ఎన్టీఆర్ సినిమాల్లోకి వెళ్లేసమయంలో తన కుటుంబం ఎంతో సపోర్టు చేసింది.ముఖ్యంగా ఆయన సోదరుడు త్రివిక్రమరావు ఎన్టీయార్ వెన్నంటే ఉండేవాడు.
ఇక సినిమా ఇండస్ట్రీలో రామలక్ష్మణులుగా ఎన్టీఆర్, త్రివిక్రమ రావు సోదరులను గుర్తుచేసుకునే వారట..ఎన్టీఆర్ రాముడైతే త్రివిక్రమరావు లక్ష్మణుడు అని భావించేవారట.. వీరి మధ్య బంధం అలా ఉండేది. అన్న చెప్పిన మాటను జవదాటే వాడు కాదు త్రివిక్రమరావు.ఎన్టీఆర్ రాజకీయాల్లో, సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ త్రివిక్రమరావు మాత్రం తన కుటుంబాన్ని ఇటు పార్టీని తన భుజస్కంధాలపై మోశాడు.కేవలం మన బ్యానర్‌లోనే కాకుండా ఇతర బ్యానర్లలో కూడా సినిమాలు చేయండని అన్నకు సలహాలు కూడా ఇచ్చేవాడట..ఇక ఏదైనా ఎన్టీఆర్ సినిమా ప్రారంభించే టైంలో కచ్చితంగా త్రివిక్రమ రావు క్లాప్ కొట్టాల్సిందే. అంతే కాకుండా కొబ్బరికాయ కూడా తమ్ముడితోనే కొట్టించేవాడట ఎన్టీఆర్. తన తమ్ముడు అంటే ఎన్టీఆర్‌కు ఎంత ప్రేమో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడంటే దాని వెనక త్రివిక్రమ రావు పాత్ర చాలా ఉందని సన్నిహితులు చెబుతుంటారు.
Why did SR NTR keep his own brother away
అదేవిధంగా ఎన్టీఆర్ కృష్ణ కుమారిని పెళ్లి చేసుకుంటానంటే తన వదిన కన్నీళ్లు చూడలేక ఆవిడను రాత్రికి రాత్రే బెంగుళూరు పంపించాడట.ఈ విషయం తెలిసినా త్రివిక్రమరావును ఎన్టీఆర్ ఏమీ అనలేదు. ఎన్టీఆర్ తమ్ముడు ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా ఎల్లప్పుడూ తన అన్న గురించే ఆలోచించేవాడని తెలుస్తోంది.ఇలా అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఎన్టీఆర్కు తెలియకుండా పార్టీ శ్రేయస్సు కోసం త్రివిక్రమరావు రూ.20,000 విరాళాలు సేకరించాడట.అయితే, ఈ విషయం ఎన్టీఆర్కు తెలిశాక త్రివిక్రమరావు పై సీరియస్ అయ్యాడని తెలిసింది. తమ్ముడు చేసింది మంచి పనే అయినా త్రివిక్రమ రావును మందలించి దూరం పెట్టేసాడు.ఇక ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ అతడితో మాట్లాడలేదని సన్నిహితులు చెబుతుంటారు.కానీ చివరి రోజుల్లో మాత్రం అన్నదమ్ములు ఇద్దరూ కలిసి పోయారని అంటున్నారు కొందరు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.