Nivetha Pethuraj : ఆ హీరోయిన్ డిక్కీ సంగ‌తి ఇదా.. జ‌నాల‌ని పిచ్చోళ్ల‌ని చేసావు క‌ద‌మ్మా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Nivetha Pethuraj : ఆ హీరోయిన్ డిక్కీ సంగ‌తి ఇదా.. జ‌నాల‌ని పిచ్చోళ్ల‌ని చేసావు క‌ద‌మ్మా..!

Nivetha Pethuraj : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. విశ్వక్ సేన్ నటించిన పాగల్, దాస్ కా ధమ్కీ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. ఇవే కాకుండా ఇతర చిత్రాలతో అలరించిన నివేదా పేతురాజ్ ఇటీవ‌ల ఓ ఇష్యూతో వార్త‌ల‌లో నిలిచింది. నివేదా పేతురాజ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో నివేదా పోలీసులతో గొడవ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఈ ఘటన ఎప్పుడు, […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 June 2024,6:00 pm

Nivetha Pethuraj : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. విశ్వక్ సేన్ నటించిన పాగల్, దాస్ కా ధమ్కీ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. ఇవే కాకుండా ఇతర చిత్రాలతో అలరించిన నివేదా పేతురాజ్ ఇటీవ‌ల ఓ ఇష్యూతో వార్త‌ల‌లో నిలిచింది. నివేదా పేతురాజ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో నివేదా పోలీసులతో గొడవ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. అయితే వీడియో చూసిన నెటిజన్లు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్లు పెడుతున్నారు. నివేదా కూడా ఇప్పటి వరకు ఎక్కడా వీడియోపై స్పందించలేదు. అసలేం జరిగిందంటే?

Nivetha Pethuraj : ప్ర‌మోష‌న‌ల్ స్టంటా..

నివేదా కారులో వెళ్తుండగా.. ఆమె కారును పోలీసులు అడ్డుకోవడం.. డిక్కీ ఒపెన్ చేయాలని చెబితే పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులతోనే గొడవ పడింది నివేదా. డిక్కీ ఒపెన్ చేయను ఎందుకంటే ఇది నా పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులతో వాదించింది. అలాగే అక్కడే వీడియో తీస్తున్న వ్యక్తిపై సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అసలు నివేదాకు ఏమైందంటూ నెటిజన్స్ షాకయ్యారు. ఉన్నట్లుండి పోలీసులతో ఈ బ్యూటీకి గొడవేంటీ అంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి.తాజాగా ఈ విషయాన్ని జీ5 ట్వీట్ చేస్తూ నివేదా కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించింది. నివేదా పోలీసులతో గొడవ పడిన వీడియోను షేర్ చేస్తూ పరువు పేరుతో కొత్త సినిమా రాబోతుందంటూ వెల్లడించింది.

Nivetha Pethuraj ఆ హీరోయిన్ డిక్కీ సంగ‌తి ఇదా జ‌నాల‌ని పిచ్చోళ్ల‌ని చేసావు క‌ద‌మ్మా

Nivetha Pethuraj : ఆ హీరోయిన్ డిక్కీ సంగ‌తి ఇదా.. జ‌నాల‌ని పిచ్చోళ్ల‌ని చేసావు క‌ద‌మ్మా..!

ఇందులో నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ మూవీ జూన్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. దీంతో నివేదా పోలీసుల గొడవ అంతా పబ్లిసిటీ స్టంట్ అని తేలడంతో షాకవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది. నివేదా పేతురాజ్.. మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినా ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెరిసింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు ఓటీటీలో పరువు అనే సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది