Nivetha Pethuraj | గుట్టు చప్పుడు కాకుండా ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న హీరోయిన్.. ఫొటోలు వైరల్
Nivetha Pethuraj | టాలీవుడ్‌లో తన సొగసైన నటనతో మంచి గుర్తింపు సంపాదించిన నటి నివేదా పేతురాజ్ తన అభిమానులకు ఓ హ్యాపీ న్యూస్ చెప్పింది. త్వరలోనే తాను వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నట్టు ఆమె స్వయంగా ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నివేదా ఓ ఫొటోను షేర్ చేస్తూ, తన నిశ్చితార్థం పూర్తయినట్లు, త్వరలో పెళ్లి కూడా జరగబోతోందని వెల్లడించింది.

#image_title
శుభాకాంక్షల వెల్లువ..
ఆమె పోస్ట్ చేసిన నిశ్చితార్థ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త జంటపై అభినందనల జల్లు కురుస్తోంది. నివేదా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్. వ్యాపార రంగానికి చెందిన ఆయన, దుబాయ్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ పర్సన్ అని వార్తలుగా ప్రచారంలో ఉన్నాయి. ఈ ఏడాది చివరిలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వేడుకలను సింపుల్‌గా, కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్యే జరిపించాలని ఇరు కుటుంబాలూ నిర్ణయించుకున్నట్టు సమాచారం. పెళ్లికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. తమిళ సినిమాగా వచ్చిన ‘ఒరు నాల్ కూతు’ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన నివేదా, తెలుగులో ‘మెంటల్ మదిలో’ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’, ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. మొదలైంది!