Shobana : సీనియర్ నటి శోభన తెలుసు కదా. ఒకప్పుడు తను స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళం ఇండస్ట్రీలో వెలుగొందింది. తను అద్భుతమైన డ్యాన్సర్ కూడా. క్లాసికల్ డ్యాన్స్ లో తనకు మంచి ప్రతిభ ఉంది. అందుకే తనకు సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళం, మళయాలంలో చాలా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న శోభన కొన్నేళ్లకే సినిమాలకు దూరం అయిపోయింది. 1984 లో తను సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమాలో సుమన్ హీరో. ఆ తర్వాత విక్రమ్ సినిమాలో నటించింది.
వరుసగా స్టార్ హీరోల సరసన నటించి త్వరగా స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. మలయాళంలో నటించి పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. తనకు నాట్యం అంటే చాలా ఇష్టం ఉండటం వల్ల.. 1994 లో శోభన కళార్పణ అనే సంస్థను స్థాపించింది. చాలామంది కళాకారులకు ఆమె నాట్యాన్ని నేర్పించింది. ఆమె మలయాళి అయి ఉండి కూడా తెలుగు వారితో బాగా కలిసిపోయింది. తను సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడే శోభన ఒక మలయాళం హీరోను ప్రేమించిందట.
అయితే.. ఆ హీరో కొన్నేళ్లకు తనను మోసం చేశాడట. దీంతో అప్పటి నుంచి ప్రేమ, పెళ్లికి దూరంగా ఉండాలని శోభన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. శోభన కేవలం పెళ్లి మాత్రం చేసుకోవద్దని నిర్ణయించుకుంది కానీ.. ఓ చిన్నారిని మాత్రం దత్తత తీసుకుంది. ప్రస్తుతం ఆమె నాట్యమే లోకంగా బతుకుతోంది. కాకపోతే అప్పుడప్పుడు మంచి చాన్స్ లు దొరికితే సినిమాల్లోనూ నటిస్తోంది. అలా.. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా బతుకుతోంది శోభన. భవిష్యత్తులో కూడా తనకు పెళ్లి చేసుకునే ప్లాన్స్ కూడా ఏవీ లేవని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.