Shobana : ‘అక్కడ’ ఉంది అన్నమాట అసలు ప్రాబ్లం.. అందుకే యాభై ఏళ్ళు వచ్చినా హీరోయిన్ శోభన పెళ్లి చేసుకోలేదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shobana : ‘అక్కడ’ ఉంది అన్నమాట అసలు ప్రాబ్లం.. అందుకే యాభై ఏళ్ళు వచ్చినా హీరోయిన్ శోభన పెళ్లి చేసుకోలేదు..!

 Authored By kranthi | The Telugu News | Updated on :10 January 2023,8:20 pm

Shobana : సీనియర్ నటి శోభన తెలుసు కదా. ఒకప్పుడు తను స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళం ఇండస్ట్రీలో వెలుగొందింది. తను అద్భుతమైన డ్యాన్సర్ కూడా. క్లాసికల్ డ్యాన్స్ లో తనకు మంచి ప్రతిభ ఉంది. అందుకే తనకు సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళం, మళయాలంలో చాలా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న శోభన కొన్నేళ్లకే సినిమాలకు దూరం అయిపోయింది. 1984 లో తను సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమాలో సుమన్ హీరో. ఆ తర్వాత విక్రమ్ సినిమాలో నటించింది.

వరుసగా స్టార్ హీరోల సరసన నటించి త్వరగా స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. మలయాళంలో నటించి పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. తనకు నాట్యం అంటే చాలా ఇష్టం ఉండటం వల్ల.. 1994 లో శోభన కళార్పణ అనే సంస్థను స్థాపించింది. చాలామంది కళాకారులకు ఆమె నాట్యాన్ని నేర్పించింది. ఆమె మలయాళి అయి ఉండి కూడా తెలుగు వారితో బాగా కలిసిపోయింది. తను సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడే శోభన ఒక మలయాళం హీరోను ప్రేమించిందట.

why heroine shobana not married till now

why heroine shobana not married till now

Shobana : ఓ మలయాళ హీరోను ప్రేమించిన శోభన

అయితే.. ఆ హీరో కొన్నేళ్లకు తనను మోసం చేశాడట. దీంతో అప్పటి నుంచి ప్రేమ, పెళ్లికి దూరంగా ఉండాలని శోభన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. శోభన కేవలం పెళ్లి మాత్రం చేసుకోవద్దని నిర్ణయించుకుంది కానీ.. ఓ చిన్నారిని మాత్రం దత్తత తీసుకుంది. ప్రస్తుతం ఆమె నాట్యమే లోకంగా బతుకుతోంది. కాకపోతే అప్పుడప్పుడు మంచి చాన్స్ లు దొరికితే సినిమాల్లోనూ నటిస్తోంది. అలా.. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా బతుకుతోంది శోభన. భవిష్యత్తులో కూడా తనకు పెళ్లి చేసుకునే ప్లాన్స్ కూడా ఏవీ లేవని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది