Balakrishna : బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం అదేనా?

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 20 February 2022, 6:30 pm

Balakrishna : ఆహా ఓటీటీలో స్టార్ట్ అయిన అన్ స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ఆ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదు. ఆహా ఓటీటీనే కాదు.. సోషల్ మీడియానే ఆ షో ఓ ఊపు ఊపింది. అసలు.. బాలకృష్ణ హీరోగానే కాదు.. హోస్ట్ గా కూడా సూపర్ డూపర్ గా నటించగలడు అని నిరూపించిన షో అది.తెలుగులోనే ఇప్పటి వరకు ఏ షో అంతగా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోలేదు.

ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అవడంతో సెకండ్ సీజన్ ను త్వరలో స్టార్ట్ చేసేందుకు ఆహా యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. వచ్చే జులైలో అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ ప్రారంభం కానుంది.ఫస్ట్ సీజన్ లో పెద్ద పెద్ద స్టార్లే ఈ షోకు గెస్టులుగా వచ్చారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా వచ్చారు. కానీ.. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, వెంకటేశ్ ఈషోలకు హాజరు కాలేదు.

why junior ntr not attended as guest in balakrishna unstoppable show

why junior ntr not attended as guest in balakrishna unstoppable show

Balakrishna : సెకండ్ సీజన్ తొలి గెస్ట్ ఎవరో తెలుసా?

అసలు.. బాబాయి అబ్బాయి షో ఎప్పుడు ఉంటుందా అని నందమూరి అభిమానులు తెగ ఎదురుచూశారు.కానీ.. ఆ కోరిక ఫస్ట్ సీజన్ లో నెరవేరలేదు. దీంతో సెకండ్ సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ కే జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చేందుకు ఆహా యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందట. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి