
why Mahesh Babu Son Gautham Ghattamaneni not visited His Grandmother Indira Devi
Mahesh Babu Son : సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృ మూర్తి నేటి తెల్లవారు జామున మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో గత కొన్ని నెలలుగా ఆమె మంచానికే పరిమితమయ్యారు. ఆమె నేడు తెల్లవారు జామున ఇంట్లో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు దేశాల్లో కుటుంబానికి చెందిన వాళ్లు సెటిల్ అయ్యారు. ఇందిరా దేవి గారి మరణ వార్త తెలిసిన వెంటనే కొందరు ఇండియాకి తిరగి రాగా.. కొందరు మాత్రం రాలేక పోయారు. మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ నానమ్మ మృత దేహం వద్దకు వచ్చినట్లుగా కనిపించ లేదు.
చాలా మంది గౌతమ్ కృష్ణ ఎక్కడ అని వెతుకుతున్నారు, సోషల్ మీడియాలో గౌతమ్ కృష్ణ నానమ్మ వద్ద ఉన్న ఫోటోలు ఏమైనా ఉన్నాయా అంటూ సోధిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే గౌతమ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. కొన్ని నెలల క్రితమే గౌతమ్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే మహేష్ బాబు ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. విదేశాలకు మొదటి సారి చదువు నిమిత్తం ఒంటరిగా వెళ్తున్న గౌతమ్ ని విడిచి ఉండడం కాస్త కష్టమే అన్నట్లుగా నమ్రత కూడా గౌతమ్ యొక్క ఫోటోను షేర్ చేసి తన ఫీలింగ్ ని తెలియజేసింది. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు గౌతం హైదరాబాదులో లేడని అర్థమవుతుంది. అందుకే నానమ్మ మృత దేహం వద్ద సీతార మాత్రమే కనిపించింది, గౌతమ్ లేడు అభిమానులు కొందరు భావిస్తున్నారు.
why Mahesh Babu Son Gautham Ghattamaneni not visited His Grandmother Indira Devi
నానమ్మతో ఉన్న బాండింగ్ తో సితార వెక్కి వెక్కి ఏడ్చిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గౌతమ్ కి కూడా నానమ్మ ఇందిరా దేవి గారితో మంచి బాండింగ్ ఉంది. సెలవులు వచ్చిన ప్రతి సారి కూడా నాయనమ్మ వద్దకు వెళ్లడం వారికి అలవాటు. అందుకే సీతార అంతగా ఏడ్చింది. గౌతమ్ ఉండి ఉంటే కచ్చితంగా తను కూడా కన్నీళ్లు పెట్టుకునే వాడు. పాపం గౌతం విదేశాల్లో ఉండి పోయాడు. నానమ్మ చివరి చూపును నోచుకోలేక పోయాడు అంటూ స్వయంగా కృష్ణ అభిమానులు మరియు కుటుంబ సభ్యులు అంటున్నారు. అనారోగ్య సమస్యలతో మరణించిన ఇదిరా దేవి గారి మృత దేహంను ఎక్కువ సమయం ఉంచేందుకు కుటుంబ సభ్యులు సిద్ధపడలేదు. మరణించిన కొన్ని గంటల్లోనే ఆమె మృత దేహంను ఖననం చేయడం జరిగింది. ఆమె అంత్యక్రియలు చాలా స్పీడ్ గా జరిగాయి. కుటుంబానికి చెందిన గౌతం కృష్ణ మాత్రమే కాకుండా మరికొందరు కూడా ఇదిరా దేవి గారి చివరి చూపుకుని నోచుకోలేక పోయారు.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.