super star Krishna second marriage and vijaya nirmala Indira Devi bonding
Indira Devi : సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి మరణం కుటుంబ సభ్యులను.. ఇండస్ట్రీ వర్గాల వారిని.. అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. ఈ సమయంలో మరోసారి సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క రెండు పెళ్లిళ్ల విషయం ప్రస్తావన వచ్చింది. ఇందిరా గారు ఉండగానే ఎందుకు కృష్ణ రెండవ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనే విషయమై చాలా పుకార్లు ఉన్నాయి. అప్పట్లో ఇందిరా మరియు కృష్ణ గార్ల మధ్య విభేదాల కారణంగా విజయ నిర్మలను ఆయన పెళ్లి చేసుకున్నాడంటూ ప్రచారం జరిగింది. కానీ అది ఏమాత్రం వాస్తవం కాదు. ఇందిరా గారితో ఎలాంటి విభేదాలు లేక పోయినా.. విజయ నిర్మల గారితో ప్రేమలో పడడంతో కృష్ణ రెండవ పెళ్లికి సిద్ధమయ్యారు.
తేనె మనసులు సినిమా ప్రారంభం అయ్యే నాటికి సూపర్ స్టార్ కృష్ణ కి ఇందిరా గారితో వివాహమైంది. 1965 వ సంవత్సరంలో పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టాడు. అంతకు ముందు సంవత్సరం వారి పెళ్లి అయి ఉంటుంది. కృష్ణ ఇందిరా ఇలా మధ్య అనుబంధం అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో, 1967 లో కృష్ణ, విజయనిర్మల పరిచయమైంది. సర్కార్ ఎక్స్ ప్రెస్ అనే సినిమాలో వీరిద్దరూ హీరో హీరోయిన్ గా నటించారు. ఆ సమయంలోనే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని చెప్పుకున్నారు. ఇద్దరికీ కూడా రెండవ పెళ్లి అవ్వడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ముందడుగు వేశారు. 1969 లోనే కృష్ణ, విజయనిర్మల పెళ్లి చేసుకున్నారు. విజయనిర్మలను పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ తన మొదటి భార్య ఆయన ఇందిరా ని చిన్న చూపు చూడలేదు. పైగా ఇందిరా దేవి గారు కూడా వారిద్దరి యొక్క ప్రేమను స్వాగతించారు.. కృష్ణ యొక్క నిర్ణయాన్ని ఆమె వ్యతిరేకించకుండా ఆయన ఇష్టం అన్నట్లుగా వదిలేశారు.
super star Krishna second marriage and vijaya nirmala Indira Devi bonding
అందుకే తన పిల్లలను విజయ నిర్మల వద్దకు అప్పుడప్పుడు పంపించే వారు, విజయ నిర్మల కూడా తన సొంత కొడుకు నరేష్ మాదిరిగానే మంజుల, మహేష్ బాబు లను చూసుకునేవారట. అలాగే ఇందిరా తన కుమార్తెల పెళ్లి సమయంలో విజయ నిర్మలను ఆహ్వానించడం మాత్రమే కాకుండా ఆమెకు పనులు పురమాయించేవారు అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. పలు సందర్భాల్లో ఇందిరా మరియు విజయ నిర్మల కలిశారని.. వారి మధ్య విభేదాలు ఉండేవి కావని కుటుంబ సభ్యులు మరియు కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు అంటూ ఉంటారు. మహేష్ బాబు కూడా విజయ నిర్మలకు సన్నిహితంగా ఉండేవారు. విజయ నిర్మల బతికున్న సమయంలో పలు సందర్భాల్లో మహేష్ బాబు, నమ్రత ఆమె దగ్గరకు వెళ్తూ వస్తూ ఉండేవారు. కృష్ణ తన ఇద్దరు భార్యలను కోల్పోవడంతో తీవ్ర దుఃఖంలో ఉన్నారు. విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇందిరా దేవికి ఎప్పుడు కూడా కృష్ణ అన్యాయం చేయలేదని అభిమానులకు తెలియాల్సి ఉంది. ఆసక్తికర విషయమేంటంటే కృష్ణ గారు విజయ నిర్మల ని పెళ్లి చేసుకున్న తర్వాతే చిన్న కూతురు ప్రియదర్శిణి పుట్టారట.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.