Naga Babu : నాగబాబు సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేయడం లేదట.. ఎందుకంటే!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 9 February 2023, 5:00 pm

Naga Babu : మెగాస్టార్ చిరంజీవి యొక్క పెద్ద తమ్ముడు నాగబాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. నటుడిగా సక్సెస్ కాలేక పోయినా నాగబాబు ని చిరంజీవి స్వయంగా నిర్మాతగా పరిచయం చేశాడు. నాగబాబు నిర్మాతగా చేసిన కూడా కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. నాగబాబు నటించాలనుకుంటే ఇప్పటికి కూడా వరుసగా ఆఫర్స్ వస్తాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు అయ్యుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అన్నయ్య అయ్యుండి చిన్నా చితక పాత్రలు చేస్తే బాగుండదు అంటున్నారు.

why mega brother Naga Babu not doing back to back movies

why mega brother Naga Babu not doing back to back movies

నాగబాబు తన అన్నయ్య మరియు తమ్ముడు స్టార్స్ అనే ఉద్దేశంతో వస్తున్న చాలా ఆఫర్స్ ని సున్నితంగా నాగబాబు తిరస్కరిస్తున్నాడని ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను నాగబాబు అలరించే విధంగా గతంలో సినిమాలు చేశాడు. ఆయన చేసిన పాత్రలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి. అయినా కూడా ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు కొందరు ఫిలిం మేకర్స్ ఆసక్తి చూపించడం లేదు. అందుకు కారణం ఆయనకు తగ్గ పాత్రలను తాము క్రియేట్ చేయలేము అని వారు భావిస్తున్నారు.

why mega brother Naga Babu not doing back to back movies

why mega brother Naga Babu not doing back to back movies

అంతే కాకుండా నాగబాబు యొక్క కొత్త సినిమాలు ప్రస్తుతానికి ఏమీ లేవు. మరో వైపు ఆయన జనసేన పార్టీ కీలక నేతగా వ్యవహరిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసేది లేదు అంటూ తేల్చి చెప్పిన నాగబాబు సినిమాల విషయంలో మాత్రం ఆసక్తి చూపించడం లేదని అర్థమవుతుంది. అన్నయ్య మరియు తమ్ముడి యొక్క ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని నాగబాబు సినిమాలు చేయడం లేదని మెగా కాంపౌండ్ నుండి జోరుగా ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో నాగబాబు నిర్మాతగా వరుస సినిమాలు నిర్మించే అవకాశాలు ఉన్నాయట.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి