Chiranjeevi : ఎవ్వరూ ఊహించని డైరెక్టర్ తో చిరంజీవి సినిమా.. చిరు పప్పులో కాలేశారా? లేక ఓవర్ కాన్ఫిడెన్సా?
Chiranjeevi : ఇప్పుడు టాలీవుడ్ లో ఎవరు సినిమా తీసినా అది పాన్ ఇండియాగానే రూపొందుతోంది. ఇటీవల వచ్చిన దసరా సినిమా కూడా పాన్ ఇండియా లేవల్ లో రూపొందింది. అందుకే బడ్జెట్ పెరుగుతోంది. పాన్ ఇండియా సినిమా అంటే బడ్జెట్ పెరుగుతుంది కానీ.. ఒకవేళ సినిమా బెడిసికొడితే ఒకేసారి వందల కోట్లు నిర్మాత నష్టపోవాల్సి వస్తోంది. కాకపోతే కొన్ని సినిమాలు మాత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అవుతున్నాయి. పాన్ ఇండియా లేవల్ లో సూపర్ సక్సెస్ ను సాధిస్తున్నాయి.
దానికి ఉదాహరణ బలగం మూవీ.ఇటీవల హిట్ అయిన బలగం సినిమా సూపర్ హిట్ అవడానికి కారణం కథ. అద్భుతమైన కథ ఆ సినిమాను ఆ రేంజ్ కు తీసుకెళ్లింది. అటువంటి సినిమాలనే ప్రస్తుతం జనాలు కూడా ఆదరిస్తున్నారు. అందుకే అటువంటి కథ నేపథ్యం ఉన్న సినిమాలనే ఎంచుకోవాలని మెగాస్టార్ అనుకుంటున్నారట. అందుకే నిన్న కాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన డైరెక్టర్ కు అవకాశం ఇవ్వాలని చిరు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మీకు బింబిసార సినిమా గుర్తుందా? అది సోసియో ఫాంటసీ మూవీ. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలుసు కదా.
Chiranjeevi : మల్లాది వశిష్టకు చాన్స్ ఇచ్చిన మెగాస్టార్
యంగ్ డైరెక్టర్ మల్లాది వశిష్ట దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు మల్లాది వశిష్టకు అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది. మల్లాది వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమాలో చిరంజీవి నటించనున్నారట. అది కూడా నేటివిటీ కంటెంట్ ఉన్న సినిమా కథ అట అది. ఆ కథ వినగానే చిరు అయితే వెంటనే ఫిదా అయ్యారట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమాకు సైన్ చేశారట. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. త్వరలోనే అఫిషియల్ గా సినిమాను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.