Nagarjuna : సామాన్యులు చనిపోతే ఎవ్వరూ పట్టించుకోరు. కానీ.. ఎవరైనా సెలబ్రిటీలు చనిపోతే మాత్రం రోజుల తరబడి వాళ్ల గురించి మాట్లాడుకుంటారు. సినిమా సెలబ్రిటీలు కావచ్చు.. రాజకీయ ప్రముఖులు లేదా వ్యాపారవేత్తలు ఎవరు చనిపోయినా వాళ్లకు చాలామంది నివాళులు అర్పిస్తారు. ఇక.. మన తెలుగు ఇండస్ట్రీనే తీసుకుంటే గత సంవత్సరం చాలామంది సెలబ్రిటీలు కన్నుమూశారు. దిగ్గజ నటులే ఈ లోకాన్ని వీడిపోయారు. కృష్ణంరాజు, కృష్ణ, చలపతి రావు, సత్యనారాయణ.. ఇలా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నవాళ్లే వెళ్లిపోయారు. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా మూగబోయింది.
ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోతే అందరూ వెళ్లి ఆ ఇంటి సభ్యులను ఓదార్చుతారు. ప్రగాడ సానుభూతిని ప్రకటిస్తారు. వాళ్లకు ఏదైనా సాయం కావాలంటే అందరూ తలా చేయి వేసి మేమున్నాం అంటూ అండగా నిలబడతారు. అయితే.. ఎంతమంది దిగ్గజ నటులు చనిపోయినా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున మాత్రం వాళ్ల చివరి చూపు చూడటానికి వెళ్లరట. ఆయన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ వెళ్తారు కానీ.. నాగార్జున మాత్రం అస్సలు వాళ్లను కడసారి కూడా చూడటానికి వెళ్లరు అనే విషయం దాదాపుగా అందరికీ తెలుసు. తన నాన్న నాగేశ్వరరావు చనిపోయినప్పుడు ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. నాగార్జునను ఓదార్చింది. ఏఎన్నార్ కు ఘనమైన వీడ్కోలు అందించారు.
నాగార్జునకు కూడా ధైర్యం చెప్పారు. కానీ.. తన నాన్న వయసు ఉన్న ఇండస్ట్రీ పెద్దలు మరణిస్తే మాత్రం నాగార్జున ఒక్కరిని కూడా చూడటానికి వెళ్లలేదు. ఆయన వెళ్లి వాళ్లకు నివాళులు అర్పించకపోవడానికి కారణాలు ఏంటి అని అందరూ ఏదేదో ఊహించుకుంటున్నారు. చనిపోయిన వ్యక్తులను చూడాలంటే భయమా? లేక చనిపోయిన వాళ్లను చూస్తే అదో అపశకునంలా భావిస్తారా? అనేది తెలియక అక్కినేని ఫ్యాన్స్ కూడా తలలు పట్టుకుంటున్నారు. అసలు.. నాగార్జున ఎందుకు చనిపోయిన వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లకు నివాళులు అర్పించరో అనే విషయంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచి చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.