Ys Jagan : ఈ ప్లాన్ తో జగన్ కి మరో ప్లస్.. ఇక తిరుగులేదంతే.!? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys Jagan : ఈ ప్లాన్ తో జగన్ కి మరో ప్లస్.. ఇక తిరుగులేదంతే.!?

Ys Jagan : ఇది 2023. ఇంకో సంవత్సరంనరలో ఏపీలో ఎన్నికలు రానున్నాయి. దాని కోసం ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగా టీడీపీ నేత నారా లోకేశ్ కూడా పాదయాత్రకు సిద్ధం అవుతున్నాడు. ఈనెల 27 నుంచే చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభించాలని నారా లోకేశ్ డిసైడ్ అయ్యారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర పేరుతో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. అయితే.. రెండు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :5 January 2023,11:00 am

Ys Jagan : ఇది 2023. ఇంకో సంవత్సరంనరలో ఏపీలో ఎన్నికలు రానున్నాయి. దాని కోసం ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగా టీడీపీ నేత నారా లోకేశ్ కూడా పాదయాత్రకు సిద్ధం అవుతున్నాడు. ఈనెల 27 నుంచే చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభించాలని నారా లోకేశ్ డిసైడ్ అయ్యారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర పేరుతో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. అయితే.. రెండు ప్రధాన పార్టీలు ఎన్నికల వేళ ఇలా యాత్రలను ప్రారంభిస్తే అది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి మైనస్ అవుతుంది.

దీంతో తాజాగా ఏపీలో రోడ్లపై ర్యాలీలు, సమావేశాలు, సభలను నిర్వహించకుండా వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. నేషనల్ హైవేల మీద కానీ.. రాష్ట్ర రహదారుల మీద కానీ, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్ల మీద కానీ ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. అయితే.. ఇటీవల కందుకూరు, గుంటూరులో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఏ పార్టీ కూడా తాజా నిషేధం వల్ల ఏ రోడ్డుపై కూడా సభ పెట్టే అవకాశం ఉండదు. నిజానికి.. రోడ్ల మీద షోలు చేయడం వల్ల.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Ys Jagan why nara lokesh and pawan kalyan yatras banned

Ys Jagan why nara lokesh and pawan kalyan yatras banned

Ys Jagan : కందుకూరు, గుంటూరు ఘటనలే కారణమా?

నిర్వహణ లోపాల వల్ల కూడా ప్రజల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఏపీ వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. పోలీసులు ప్రత్యేక పర్మిషన్ ఇస్తే సభలు నిర్వహించుకోవచ్చు. సభకు ముందే పోలీసులను సంప్రదించి పర్మిషన్ తీసుకోవాలి. సభకు ఎంత మంది వస్తున్నారు. సభ ఉద్దేశం అన్నీ పరిశీలించి పోలీసులే సభకు అనుమతి ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తారు. అయితే.. ఇదంతా కావాలని ప్రతిపక్షాల పాదయాత్రలను అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిషేధం అంటూ ప్రతిపక్షాలు ఓవైపు గగ్గోలు పెడుతున్నాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది