Jabardasth Ram Prasad : జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ ఒక్కడు మిగలడంకు కారణం అతడేనా?
Jabardasth Ram Prasad : జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ ప్రస్థానం ఇప్పటిది కాదు. టీమ్ లీడర్ కాకముందు ధన్ రాజ్ టీమ్ లో కనిపించాడు. అప్పటి నుండి మొదలుకుని మొన్నటి వరకు అంటే దాదాపుగా తొమ్మిది సంవత్సరాల పాటు జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ ఉన్నాడు. గెటప్ శ్రీను మరియు రామ్ ప్రసాద్ లు కూడా సుడిగాలి సుధీర్ మాదిరిగానే సుధీర్ఘ కెరీర్ ను జబర్దస్త్ లో కంటిన్యూ చేయడం జరిగింది. ఎంతో అద్బుతమైన వీరి జర్నీ మొన్నటికి ముగిసింది. ముగ్గురు కలిసి వందల స్కిట్ లు చేశారు. లక్షల మందిని నవ్వించేందుకు కొట్టుకున్నారు… తిట్టుకున్నారు.
మొత్తానికి తెలుగు బుల్లి తెరపై వెలుగు వెలిగారు. అలాంటి సుడిగాలి సుధీర్ టీమ్ విచ్చిన్నం అయ్యింది. సుధీర్ మరియు గెటప్ శ్రీను లు పూర్తిగా జబర్దస్త్ నుండి బయటకు వెళ్లి పోయారు. కేవలం రామ్ ప్రసాద్ మాత్రమే ప్రస్తుతం జబర్దస్త్ లో కంటిన్యూ అవుతున్నాడు. వారిద్దరు వెళ్లి పోయాక రామ్ ప్రసాద్ ఎలా జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు అనేది ప్రతి ఒక్కరి అనుమానం. గెటప్ శ్రీను మరియు సుధీర్ లు సినిమాల్లో బిజీ అయ్యారు కనుక జబర్దస్త్ మానేశారు అనేది టాక్. అలాగే రామ్ ప్రసాద్ వెళ్తే ఖచ్చితంగా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు ఉంటాయి. ఆయనకు రచయితగా కూడా మంచి పేరు ఇప్పటికే వచ్చింది. ఇండస్ట్రీలో కొత్త రచయితలకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
కాని రామ్ ప్రసాద్ ఎందుకు ఆసక్తి చూపడం లేదు అనేది చాలా మంది ప్రశ్న. జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ కొనసాగడానికి కారణం ఆయనకు సంబంధించిన వారు డైరెక్షన్ టీమ్ లో ఉన్నారు. వారు రామ్ ప్రసాద్ ను వెళ్లకుండా ఆపినట్లుగా తెలుస్తోంది. మల్లెమాల వారితో కూడా రామ్ ప్రసాద్ కు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. కనుక జబర్దస్త్ నుండి రామ్ ప్రసాద్ వెళ్లకుండా అలాగే ఉన్నాడు అనేది చాలా మంది నుండి అందుతున్న సమాచారం. అయితే రామ్ ప్రసాద్ కూడా శాస్వతంగా ఏమీ ఉండదు. ఇప్పుడు ఆయనకు స్పెషల్ గా టీమ్ లీడర్ ఇచ్చారు. కనుక కొన్నాళ్లు ఆ పొజీషన్ ను ఎంజాయ్ చేసి ఆ తర్వాత బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు.